షాంపూలో కాఫీ పౌడర్ కలిపి వాడటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

కాఫీ( Coffee ) .ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాలు ఒకటి.

ముఖ్యంగా ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.

కోట్లాది మందికి కాఫీతో విడదీయలేని సంబంధం ఏర్పడింది.

మితంగా తీసుకుంటే కాఫీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.అదంతా పక్కన పెడితే.

జుట్టు సంరక్షణకు కాఫీ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా షాంపూలో కాఫీ పౌడర్ కలిపి వాడటం వల్ల ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Advertisement

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) ను వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యుల‌ర్ షాంపూ మరియు రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా కాఫీ పౌడర్ ను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.

కాఫీలో ఉండే కెఫిన్ ( Caffeine ) జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది.అవును, కెఫీన్ మీ నెత్తికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పెరిగిన రక్త ప్రసరణ జుట్టు మూలాలకు పోషకాలను తరలించడంలో సహాయపడుతుంది.

ఫ‌లితంగా మీ జుట్టు వేగంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది.అలాగే కాఫీ పౌడర్ జుట్టు రాలడాన్ని అరికడుతుందని అధ్యాయాలు చెబుతున్నాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అంతేకాకుండా పొడి, పెళుసు మరియు నిర్జీవమైన జుట్టు రూపాన్ని మెరుగుపరచడంలో కాఫీ పౌడర్ హెల్ప్ చేస్తుంది.కాఫీ పౌడ‌ర్ ఫ్లేవనాయిడ్స్‌ను క‌లిగి ఉంటుంది.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు సహజమైన హెయిర్ కండీషనర్‌గా పనిచేయడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో తోడ్ప‌డ‌తాయి.

Advertisement

కాఫీ పౌడర్ జుట్టును మృదువుగా మరియు షైనీ గా మెరిపిస్తుంది.అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది.ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తుంది.

మరియు తెల్ల జుట్టుకు సైతం చెక్ పెడుతుంది.

తాజా వార్తలు