మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీకు గుండెపోటు రావచ్చు..!

ఈ మధ్యకాలంలో పెరుగుతున్న హఠాత్తు గుండెపోటు మరణాల గురించి మనందరికీ తెలిసిందే.

యువకులు కూడా గుండెపోటుతో ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం.

అయితే కొన్ని జాగ్రత్తలతో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా ముందస్తు వార్నింగ్ బెల్స్ కు స్పందించడం చాలా మంచిది.

చాలా మందిలో గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.వాటిని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా మరణం నుంచి తప్పించుకోవచ్చు.

అయితే గుండెపోటు( Heart attack ) ముందు శారీరకంగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు హెచ్చరిస్తాయి.ఇవి కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి.

Advertisement

ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అలుపు, ఆయాసం, ఊపిరి అందకపోవడం, పనిచేసుకోలేకపోవడం, కారణం లేకుండానే బరువు తగ్గిపోవడం, అరికాళ్ళలో చెమటలు లాంటి లక్షణాలు కొద్ది రోజులుగా లేదా వారాలుగా కనిపిస్తూ ఉంటే కచ్చితంగా గుండె జబ్బు ఉన్నట్టే అని అంటున్నారు వైద్య నిపుణులు.

ఈ లక్షణాలు కనిపిస్తే చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఏ క్షణమైన గుండెపోటు రావచ్చు .

ఇక శరీరంలోని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఏర్పడిన అడ్డంకే గుండెపోటుకు దారి తీస్తుంది.అందుకే రక్తాన్ని సరఫరా చేసే ధమని బ్లాక్ కావడంతో ఈ పరిస్థితి వస్తుంది.అయితే ఇలాంటి సమయంలోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

తినే ఆహారంలో కొవ్వులు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి.ఇక మాంసం, పాల పదార్థాలను కూడా మితంగా తీసుకోవాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.

Advertisement

ఇక పొటాషియం ఎక్కువగా ఉండే టమాటా, వేరుశనగ, అరటి పండ్లు( Peanut ) ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.ఇక ఉప్పును తక్కువగా వాడాలి.సిగరెట్లు, బీడీలు, మద్యపానం లాంటివి గుండెపోటు ముప్పును 70% అధికం చేస్తాయి.

అందుకే వ్యాయామాలతో గుండె జబ్బులు దరిచేరనియకుండా ప్రయత్నించాలి.ఇక గుండెపోటు ముందస్తు లక్షణాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి.

అప్పుడే వెంటనే చికిత్స అందుకుని 90% వరకు గుండెపోటును నిరోధించవచ్చు.

తాజా వార్తలు