డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఇవే.. తొలి వారం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాల స్థాయిలో డీజే టిల్లు కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది.

ఈ సినిమాతో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహశెట్టిలకు మంచి పేరు వచ్చింది.నైజాంలో డీజే టిల్లు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.తెలంగాణలో ఈ సినిమా ఏకంగా 5.66 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.సీడెడ్ లో ఈ సినిమా కలెక్షన్లు కోటీ 45 లక్షల రూపాయలు కాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమా కలెక్షన్లు కోటీ 2 లక్షల రూపాయలుగా ఉన్నాయి.

గోదావరి జిల్లాల్లో ఈ సినిమా కోటీ 26 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.కృష్ణా, గుంటూరు జిల్లాలలో కోటీ 3 లక్షల రూపాయలు, ఓవర్సీస్ లో కోటీ 79 లక్షల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో కోటీ 35 లక్షల రూపాయలు ఈ సినిమా కలెక్షన్లుగా ఉండటం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 12 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.భీమ్లా నాయక్ సినిమా రిలీజయ్యే వరకు డీజే టిల్లు మాత్రమే ప్రేక్షకులకు ఆప్షన్ గా మిగిలింది.

Advertisement
Dj Tillu Movie First Week Word Wide Collections Details Here , Details Here, Dj

సిద్ధు జొన్నలగడ్డ భవిష్యత్తు సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే ఈ హీరో మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో చేరడం గ్యారంటీ అని చెప్పవచ్చు.తర్వాత సినిమాల కథల విషయంలో సిద్ధు జొన్నలగడ్డ జాగ్రత్త వహించాల్సి ఉంది.

Dj Tillu Movie First Week Word Wide Collections Details Here , Details Here, Dj

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ప్లస్ అయిందని చెప్పవచ్చు.టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో వరుసగా విజయాలు అందుకుంటున్న హీరోలు తక్కువ మంది ఉన్నారు.సిద్ధు జొన్నలగడ్డ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

సిద్ధు జొన్నలగడ్డ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు