Allu Arjun Chiranjeevi : బన్నీ చిరంజీవిలా విజృంభిస్తున్నాడు.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ కు కొంతమేర నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్నారు.

పుష్ప ది రూల్ కోసం లుక్ ను మార్చుకున్న బన్నీ ఈ సినిమాతో పుష్ప ది రైజ్ ను మించి గ్యారంటీగా మెప్పిస్తానని అభిమానులకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

బన్నీ ఏ ఈవెంట్ కు హాజరైనా ఆ ఈవెంట్ కు అంచనాలను మించి అభిమానులు హాజరవుతున్నారనే సంగతి తెలిసిందే.అయితే ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ తాజాగా బన్నీ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

తినగా తినగా చేదు కూడా తీపి అవుతుందని అల్లు శిరీష్ కూడా ప్రేక్షకులకు నచ్చుతున్నాడని ఆయన పేర్కొన్నారు.కంటెంట్ బాగోకపోతే ఏ సినిమా అయినా ఆడదని గీతాకృష్ణ వెల్లడించారు.

అల్లు అర్జున్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని గీతాకృష్ణ పేర్కొన్నారు.ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్ కు వచ్చిన ఆడియన్స్ అంతా పెయిడ్ ఆడియన్స్ అని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement

ఈవెంట్స్ లో అల్లు అర్జున్ చిరంజీవి లెవెల్ లో విజృంభించి మాట్లాడటం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.అల్లు అరవింద్ అల్లు శిరీష్ ను కూడా నిలబెట్టాలని భావించి కష్టపడుతున్నారని ఆయన కామెంట్లు చేశారు.

ఊర్వశివో రాక్షసివో సినిమా అనుకున్న స్థాయిలో లేదని నాకు రిపోర్ట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

అల్లు అరవింద్ సొంత థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని ఆయన పేర్కొన్నారు.చిరంజీవికి నిజ జీవితంలో గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ అని గీతా కృష్ణ కామెంట్లు చేశారు. నాగబాబు సినిమాల్లో సక్సెస్ కాలేదని అలా కొంతమంది కారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఓటీటీ సినిమాలను రక్షిస్తోందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు