Three capitas AP : మూడు రాజధానులు 33 కబ్జాలు ,66 లూటీలు!

ఉత్త్తరాంద్ర వెనకబడి ఉందని ప్రభుత్వ పెద్దలు సుద్దులు చెబుతూ ఈ ప్రాoత అభివృద్దే మా ద్యేయం అంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఎవరు అడ్డుపడినా సహించబోమంటూ సవాళ్లు వేస్తున్నారు.కానీ వారి మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదు.

 Three Capitas In Andra Pradesh , Three Capitas, Ap , Vishakapatnam, Ycp, Ap Polt-TeluguStop.com

ఒక పక్కన విశాఖలో పెద్దఎత్తున భూములు కబ్జాచేస్తూ,తాకట్టు పెడుతూ మరొపక్కన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ భ్రమలు కల్పిస్తున్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకొని 41నెలలుగా విశాఖలో దోచుకున్న సొమ్ము అక్షరాలా రూ.40 వేల కోట్లని సమాచారం.ఇందులో ఉత్తరాంధ్రా అభివృద్ధి కోసం కనీసం పదికోట్లు కూడా ఖర్చుపెట్టిన పరిస్థితి లేదు.

ఉత్తరాంధ్ర సంపదను దోచుకునేందుకే విశాఖలో పరిపాలన రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు ప్రజలను మోసం చేస్తున్నారని అర్ధం అవుతుంది.విశాఖ వాణిజ్య రాజధాని గా ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధికి ఆయువు పట్టు వంటిది.

విశాఖలో ప్రభుత్వ భూములను అభివృద్ధి కొరకు వినియోగిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.కానీ జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ 25వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు విశాఖ నగరంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు,భవనాలు,ఖాళీ స్థలాలు తాకట్టు పెట్టారు.

నగరంలో 128 ఎకరాలకు పైగా భూములను మొదట ఏపీఎస్ డీసీ కి బదలాయించి తర్వాత భూములను బ్యాoకుల్లో తాకట్టు పెట్టారు.ఆలా అప్పు తెచ్చిన నిధులను ఉత్తరాంధ్రా అభివృద్ధికో,వెనుకబడిన జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికో,ఇతర ఆస్తుల కల్పనకో తనఖా పెట్టలేదు.

విశాఖ నగరంలో రూ 2,954 కోట్ల విలువైన 13 ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం ఏపీఎస్ డీసీకి బదలాయించి వాటిని తనఖా పెట్టి ఋణం తీసుకున్నది ప్రభుత్వం.కనీసం అక్కడి ప్రభుత్వ భూములు తనఖా పెట్టి అప్పు తెచ్చిన నిధులు అయినా ఆ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగించడంలేదు.

మరో వైపు ప్రయివేటు భూములను అధికార పార్టీ బడానేతలు వివిధ రూపాల్లో కబ్జా చేస్తున్నారు.విశాఖ నగరం భూ బకాసురులు కబంధ హస్తాల్లో చిక్కుకొన్నది.

విశాఖలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు,భూములు దోచుకున్న వైసీపీ నేతలు.తాజాగా మళ్ళి మధురవాడలో సుమారు రూ.1,600 కోట్ల విలువ చేసే భూ కుంభకోణానికి పాల్పడినట్లు సమాచారం.విశాఖ జిల్లా భూ కుంభకోణాలకు నిలయంగా మారింది.

వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార పార్టీ పెద్దలే భూ కబ్జాలు చేస్తున్నారు.

Telugu Amravathi, Ap Poltics, Madhurawada Ncc, Rishikonda, Capitas, Vishakapatna

విశాఖలో రుషికొండ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం.నిబంధనలకు విరుద్దంగా చారిత్రక రుషికొండను 60ఎకరాలకు పైగా తవ్వేసి బోడి గుండును చేశారు.దీని ద్వారా రూ.3 వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడినట్లు సమాచారం రుషికొండలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించి 60ఎకరాలను చదును చేశారు.అప్పటికే ఉన్న హరిత రిసార్ట్స్ కూల్చివేతతో రూ.200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.రుషికొండకు సమీపంలో కార్తీకవనం భూములను కొట్టేసి రాడిసన్ బ్లూ రిసార్ట్స్ నిర్మిస్తున్నారు.

మధురవాడ ఎన్ సీసీ భూములు కబ్జా చేశారు.అక్కడే డేటా సెంటర్ కు 130 ఎకరాలు గతప్రభుత్వం లీజుకు ఇవ్వగా అందులో 65 ఎకరాలు వాటా కాజేశారు.గంగవరం పోర్టులో 6 వేల కోట్ల విలువైన ఆస్తులు రూ.600 కోట్లకు ధారాదత్తం చేశారు .భోగాపురం విమానాశ్రయం భూముల పేరుతో రూ.400కోట్లు, హెటిరో పేరుతో రూ.400కోట్ల భూముల్ని కబ్జాచేశారు.విశాఖలో రూ.5వేల కోట్ల విలువైన 15 ఎకరాల దసపల్లా భూములు కాజేశారు.నిషేధిత భూముల జాబితాలో(22ఏ) ఉండగానే నగరానికి చెందిన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉమేష్, దుస్తుల వ్యాపారి గోపినాథ్ రెడ్డిలకు చెందిన ఎష్యూర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్ఎల్ పీ అనే సంస్థ దసపల్లా భూములు కొనుగోలు చేసిన వారితో డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది.

దసపల్లా భూముల్లో భూయజమానులకు 29 శాతం వాటా, విజయసాయిరెడ్డి బినామీలకు చెందిన డెవలపర్ కు 71శాతం ఇచ్చారు.అయితే కూర్మన్నపాలెంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూయజమానులకు 0.96శాతం, వైకాపా ఎంపీ ఎంవీవీ 99.04శాతం దక్కించుకొన్నారు.ఎన్ సిసి కంపెనీ పేరుతో ప్రస్తుత మంత్రి సోదరుడి బినామీ కంపెనీకి 97 ఎకరాల భూములు కట్టబెట్టడం ద్వారా రూ.1500 కోట్లరూపాయలు స్వాహా చేశారు.ఉత్తరాంధ్ర, విశాఖవాసుల్లో సెంటిమెంట్ రగల్చడం ద్వారా ప్రజలను పక్కదారి పట్టించి వేలకోట్లరూపాయల ఆస్తులను దోచుకోవడమే జగన్ ముఠా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube