తన మరణంపై షాకింగ్ కామెంట్లు చేసిన ఆర్జీవీ..?

వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు పేరుందనే సంగతి తెలిసిందే.

ఎప్పుడూ ఏదో విషయం గురించి కామెంట్లు చేసే వర్మ తన మరణం గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

వర్మ తెరకెక్కించే సినిమాలు, వర్మ చెప్పే మాటలు మిగతా దర్శకులకు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే.బాధ్యతలను, బంధాలను వర్మ ఎక్కువగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే.

అయితే వర్మ తన చావును కూడా లైట్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.తాజాగా వర్మ తాను చావును లైట్ తీసుకుంటానంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

అందరూ ఎప్పుడో ఒకసారి చనిపోవాలని తనకు చావంటే భయం లేదని వర్మ చెప్పుకొచ్చారు.అలాంటి చావు గురించి ఆందోళన ఎందుకని ఆర్జీవీ ప్రశ్నించారు.

Advertisement

తాను చనిపోయే సమయంలో అణుబాంబు పేలుడును చూడాలని కోరుకుంటున్ననని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

సాధారణంగా ఎవరైనా చనిపోయే సమయంలో ప్రశాంతంగా చనిపోవాలని కోరుకుంటారు.కానీ వర్మ మాత్రం ఇతరులకు భిన్నంగా తన చావు భయంకరంగా ఉండాలని కోరుకోవడం గమనార్హం.అయితే వర్మ మాటలను పట్టించుకోకుండా ఉంటే మంచిదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

వర్మ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఎవరికీ అర్థం కావు.

ఒకప్పుడు వరుసగా హిట్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మాత్రం తన స్థాయికి తగని చిత్రాలను తీస్తూ తన మార్కెట్ ను అంతకంతకూ తగ్గించుకుంటున్నారు.వర్మ తీస్తున్న సినిమాలలో కొన్ని సినిమాలు నిర్మాతలకు లాభాలనిస్తున్నా ప్రేక్షకులకు మాత్రం తలనొప్పి వచ్చేలా ఉన్నాయి.వర్మ ఇకముందైనా మారతారో లేదో చూడాల్సి ఉంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

వర్మ చావు గురించి చేసిన కామెంట్లు తెలిసి రామ్ గోపాల్ వర్మ చావులో కూడా తన మార్కును చూపించారని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు