పవర్ ఫుల్ పోలీస్ గా మారిపోయిన శ్రద్ధా దాస్

కొంత మంది భామలకు అందం ఉన్న అదృష్టం కలిసి రాదు.అన్నింటికీ సిద్ధమైన అవకాశాలు రావు.

అతి కొద్ది మంది మాత్రమే అందం, అభినయానికి అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారుతారు.మొదటి కేటగిరీలో ఉండిపోయిన అందాల భామ శ్రద్ధా దాస్.

ఈమెకి కావాల్సినంత అందం ఉంది, అవసరం అయితే బికినీలో నటించేంత ధైర్యం ఉంది.యాక్టింగ్ లో కూడా శ్రద్ధగా దృష్టి పెట్టి ఇచ్చిన పాత్రలకి న్యాయం చేస్తుంది.

కానీ మొదటి నుంచి ఈమెని సెకండ్ హీరోయిన్ కేటగిరీలోనే టాలీవుడ్ దర్శకులు ఉంచారు.అది కూడా కేవలం అందాల ప్రదర్శనకు అన్నట్లు ఉపయోగించుకున్నారు.

Advertisement

దీంతో ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం దాటిపోయినా ఇప్పటికి సరైన గుర్తింపు సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ్ లో అడపాదడపా ప్రయత్నం చేసిన కూడా అక్కడ శ్రద్ధా దాస్ కి పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే ఇలాంటి భామలు అందరికి ఇప్పుడు తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి, నటిగా ఎలివేట్ చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ బెస్ట్ అప్షన్ గా దొరికింది.వెబ్ సిరీస్ లో డిఫరెంట్ పాత్రలు చేసే ఛాయస్ ఉండటంతో అక్కడ తమని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

శ్రద్ధాదాస్ కూడా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది.

నా కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నా.పోలీస్‌ డ్రస్‌ వేసుకుంటే వచ్చే కిక్కే వేరు అని అంటోంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయిన తమిళ్ స్టార్ డైరెక్టర్...

దీనికి సంబంధించిన చిత్రీకరణ పూణేలో ఆరంభం కావడంతో లొకేషన్‌లో దిగిన ఫొటోను శ్రద్ధా‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు