గుండె, గ్యాస్ నొప్పులను ఎలా గుర్తించాలో తెలుసా..?

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు గుండెపోటుతో మరణిస్తున్నారు.ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు మరి ఎక్కువగా పెరిగిపోయాయి.

దీంతో చాలా మంది ప్రజలలో ఆందోళన మొదలైంది.అలాగే చాలా మంది విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు.

గుండెలో కాస్త నొప్పిగా అనిపించినా విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు.

అయితే అది గుండెపోటు( Heart Attack ) వల్ల వచ్చిన నొప్పెన లేక గ్యాస్ ఉన్న వచ్చినా నొప్పా అని తెలుసుకోలేకపోతున్నారు.మరి కొందరు గుండె నొప్పి వచ్చిన అది గ్యాస్ నొప్పి ( Gas Pain ) అని నిర్లక్ష్యం చేసి ప్రాణముల మీదకు తెచ్చుకుంటున్నారు.కానీ గుండె నొప్పి వచ్చినప్పుడు ఉండే లక్షణాలు, గ్యాస్ వల్ల గుండె నొప్పి వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏవో తెలుసుకోవడం ద్వారా మనకు వచ్చింది గుండె నొప్పేనా లేక గ్యాస్ వల్ల వచ్చిన నొప్పేనా అని సులభంగా తెలుసుకోవచ్చు.

Advertisement

గుండె నొప్పి( Heart Ache 0 వచ్చినప్పుడు కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.విపరీతమైన చెమట పట్టడం,గుండె మధ్యన చాలా బరువుగా అనిపించడం, చాతి మీద ఏదో బరువు పెట్టినట్టు అనిపిస్తుంది.

ఎడమ చేయి, భుజం, ఎడమవైపుకు మెడ లాగుతూ ఉంటుంది.విరోచనాలు, వాంతులు కూడా అవుతూ ఉంటాయి.ఎడమవైపు దవడ నొప్పిగా అనిపిస్తుంది.

అలాగే దవడ పట్టేసినట్లు అనిపిస్తుంది.చాతి మధ్యభాగం నుంచి నిలువుగా గడ్డం వరకు నొప్పి ఉంటుంది.

గ్యాస్ నొప్పి( Gas Pain in Chest ) వస్తే కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.ఛాతిలో ఎడమవైపు నొప్పిగా ఉంటుంది.కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ముఖ్యంగా చెప్పాలంటే సాధారణ లేదా పుల్లని త్రేన్పులు వస్తూ ఉంటాయి.అలాగే కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది.

Advertisement

గుండెల్లో కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది.గ్యాస్ వల్ల వచ్చే నొప్పికి హార్ట్ ఎటాక్ వల్ల వచ్చే నొప్పికి ఇంకా చాలా తేడాలు ఉంటాయి.

కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఎంతో మంచిది.

తాజా వార్తలు