నేడు ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్( DC vs PBKS ) మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది.ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు భారీ తేడాతో ఘనవిజయం సాధించాలని భావిస్తోంది.
ఇక ఢిల్లీ జట్టుకు ఈ మ్యాచ్ కేవలం లాంఛనప్రాయమే.ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ఆట ప్రదర్శన చేసి లీవ్ పాయింట్ల పట్టికలో పదవ స్థానంలో నిలిచింది.
పంజాబ్ కాస్త అద్భుత ఆటను ప్రదర్శించి లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.ఈ మ్యాచ్లో పంజాబ్ కు గెలుపుతో పాటు పరుగుల మధ్య భారీ తేడా ఉండడం అవసరం.
ఎందుకంటే ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకోవాలంటే అధిక రన్ రేట్ తో గెలవాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య కొన్ని ఆసక్తికర విషయాలు ఏమిటో చూద్దాం.
శిఖర్ ధావన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్:
కుల్దీప్ 6 ఇన్నింగ్స్ లలో శిఖర్ ధావన్ ను( Sikhar Dhawan ) రెండుసార్లు అవుట్ చేశాడు.కుల్దీప్ బౌలింగ్లో ధావన్ కావలసిన రీతిలో పరుగులు చేయలేకపోయాడు.ఢిల్లీ బౌలర్ కుల్దీప్ పై 91.89 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు.

డేవిడ్ వార్నర్ వర్సెస్ రాహూల్ చాహార్:
వార్నర్ తన బ్యాటింగ్ తో రాహుల్ కు చుక్కలు చూపించాడు.రాహుల్ వేసిన 34 బంతుల్లో డేవిడ్ వార్నర్( David Warner ) 61 పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్ వర్సెస్ కగిసో రబడ:
వీరిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఆసక్తికర పోరు నెలకొంటుంది.టీ20 లో వార్నర్ ను రబడ( Rabada ) ఐదు సార్లు అవుట్ చేశాడు.

రిలే రస్సో వర్సెస్ అర్షదీప్ సింగ్:
అర్షదీప్ బౌలింగ్లో రిలే రస్సొ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.అర్షదీప్ మూడు ఇన్నింగ్స్ లలో రస్సో మూడుసార్లు అవుట్ అయ్యాడు.
పంజాబ్ ఎకానమీ రేటు:
ఈ ఐపీఎల్ సీజన్ లో చివరి 5 ఓవర్లలో పంజాబ్ బౌలర్ల ఎకానమీ రేటు 11.20గా నిలిచింది.ఈ ఎకానమీ రేటు పరంగా ముంబై జట్టు కూడా వెనుకంజలోనే ఉంది.







