కలలో చేప కనిపించిందా..? అయితే అది దేనికి సంకేతమంటే..?!

మనం రాత్రి పూట నిద్రపోయేటప్పుడు కలలు అనేది రావడం సర్వ సాధారణమైన విషయం అనే చెప్పాలి.ఎందుకంటే కలలు అనేవి అందరూ కంటూనే ఉంటారు.

అయితే కలలు అనేవి అందరికీ ఒకేలాగా రావాలని లేదు.ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కలలు వస్తూ ఉంటాయి.

అయితే కలలో కొన్ని కొన్ని సార్లు చేపలు కూడా వస్తూ ఉంటాయి.మరి అలా చేపలు కలలోకి రావడం వెనుక ఎమన్నా అర్ధం దాగి ఉందా.

అసలు చేపలు కలలోకి వస్తే అది దేనికి సంకేతం.మంచికా.

Advertisement

చెడుకా.అనే సంధిగ్ధంలో ఉంటారు చాలామంది.

నిజానికి స్వప్న శాస్త్రం ప్రకారం కలలో చేపలు కనిపిస్తే అది చూడటానికి చాలా శుభప్రదం అని నమ్ముతారు చాలామంది.ఎందుకంటే చేపలు కలలో కనిపిస్తే వాటిని దేవత చిహ్నంగా భావిస్తారు.

అలాగే చేపలు కలలో కనుక కనిపిస్తే రాబోయే రోజుల్లో అన్ని మంచి పనులు జరుగుతాయని అర్ధం చేసుకోవాలి.అంతేకాకుండా మీకు కలలో గోల్డ్ కలర్ ఫిష్ కనుక కనిపిస్తే మీరు మరికొద్ది రోజుల్లోనే మంచి శుభవార్త వింటారని అర్ధం.

అలాగే త్వరలో మీరు మీ ప్రేమను కలుసుకుంటారు అనికూడా అర్ధం అంట.ఒక్కోసారి కలలో చేపలకు బదులుగా డాల్ఫిన్‌లు కూడా వస్తూ ఉంటాయి.అవి కనిపించడం కూడా శుభప్రదంగానే భావించాలి.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
హై ఫీవర్... విచారణకు హాజరుకాలెను.. పోలీసులకు లేఖ రాసిన హేమ!

ఒకవేళ మీకు కలలో చిన్న చేపలు కనిపిస్తే మీకు రాబోయే కాలంలో కొన్ని పెద్ద విజయాలు సాధించబోతున్నారని గ్రహించండి.మీకు కలలో చేపలు పట్టడం లాంటివి కనిపిస్తే రాబోయే కాలంలో మీరు కొత్త ఉద్యోగంలో చేరతారు అని అర్థం.మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.

Advertisement

కానీ కలలో సొరచేప మాత్రం కనిపిస్తే అది అరిష్టంగా భావిస్తారు చాలామంది.కానీ నిజంగానే మీకు కలలో సొరచేప కనిపిస్తే మీరు కొంచెం విచారాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

అలాగే అప్పుల భారం కూడా ఉండవచ్చు.ఒకవేళ మీకు కనుక మీ కలలో చనిపోయిన చేపలు కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో కొంతమంది ఆర్థికంగా నష్టపోతారని అర్థం అంట.

తాజా వార్తలు