ఇక్కడ ప్రజలకు చెప్పులు దొరకక సతమతం.. కారణమిదే!

బ్రిటన్‌లో ఒక షాకింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.బ్రిటన్‌లో జాతీయ స్థాయిలో విపరీతంగా చెప్పుల కొరత నెలకొంది.

 Slippers Shortage In Britain , Slippers Shortage, Britain , Hotels, Spas-TeluguStop.com

ఈ నేపధ్యంలో బ్రిటన్‌లోని హోటళ్లు, స్పాలు తమ వినియోగదారులను ఇంటి నుండి చెప్పులు తీసుకురావాలని అభ్యర్థించాయి.హోటళ్లు, స్పాలకే కాదు సామాన్యులు సైతం చెప్పుల కొరతతో సతమతమవుతున్నారు.

డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం కథనం ప్రకారం, బ్రిటన్‌ను చెప్పుల కొరత వేధిస్తోంది.యూకేలోని హోటళ్లు, స్పాలు తమ కస్టమర్‌లకు విచిత్రమైన అభ్యర్థనలు చేశాయి.

జాతీయ స్థాయిలో చెప్పుల కొరత కారణంగా హోటళ్లు, స్పాలకు వెళ్లే వారికి చెప్పులు ఉచితంగా ఇవ్వబోమని హోటళ్లు, స్పాలు తమ వినియోగదారులకు తెలిపాయి.ఈ కారణంగా వినియోగదారులు తమతో పాటు చెప్పులను తీసుకురావాలి.

లేకుంటే వారు అసౌకర్యానికి గురికావలసి ఉంటుంది.

హోటళ్లు, స్పాలు ఇంటి నుండి చెప్పులు తీసుకురావాలని కస్టమర్ల ట్రిప్అడ్వైజర్‌లో రాశాయి.

దీంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అదే సమయంలో గతంలోలాగా సర్వీస్‌ అందకపోవడంతో వీరు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

తాను ఎసెక్స్‌లోని గ్రీన్‌వుడ్స్ హోటల్, స్పాలో బుక్ చేసుకున్నట్లు ఒక కస్టమర్ చెప్పాడు.దీంతో ఆ హోటల్ అతనికి వింత మెయిల్ పంపింది.‘జాతీయ స్థాయిలో చెప్పుల కొరత కారణంగా హోటల్‌లో చెప్పులు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి, మీ ఇంటి నుంచి చెప్పులు తీసుకురావాలి’ అని ఈ మెయిల్‌లో రాసింది.బ్రిటన్‌లో ఇంతకు ముందు హోటళ్లలో చెప్పులు పెద్దమొత్తంలో కొనుగోలు చేసేవారు.

కరోనా సమయంలో చెప్పులు సరఫరా కాలేదు.దీని కారణంగా హోటళ్లు, స్పాలలో చెప్పుల కొరత ఏర్పడింది.

అదే లాక్డౌన్ ముగిశాక ప్రజలు నడక కోసం బయటకు వెళ్లడం ప్రారంభించారు.ఇలాంటి పరిస్థితుల్లో పలు హోటళ్లలో చెప్పులు, షాంపూ, టవల్ తదితరాల కొరత ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube