దేత్తడి హారికకు ప్రభుత్వం బిగ్ షాక్... అదేంటంటే?

తెలంగాణ భాషతో సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న దేత్తడి హారిక సోషల్ మీడియాను నిరంతరం ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కరలేని పేరు దేత్తడి హారిక.

సోషల్ మీడియాలో రకరకాల సిరీస్ లతో మంచి పేరు సంపాదించుకున్న హారికకు బిగ్ బాస్ రూపంలో ఒక మంచి అవకాశం ఆమెను వరించింది.

అయితే బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న హారిక తనదైన ఆట తీరు, ఆటిట్యూడ్ తో చివరి వరకు పోరులో నిలిచి నాలుగో స్థానానికి చేరింది.ఎక్కడా తన మీద నెగెటివ్ ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడుతూ మంచి పేరు సంపాదించుకొని బిగ్ బాస్ నుండి నిష్క్రమించింది.

అయితే ఆ పేరే ఆమెను ఇప్పుడు మరో మెట్టు ఎక్కించింది.తాజాగా తెలంగాణ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆమెకు అందించారు.

అయితే అలా ప్రకటించిన మరుసటి రోజే ఓ వివాదం మొదలైంది.బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను తొలగించారని వార్తలు వచ్చాయి.

Advertisement

పర్యాటక శాఖ వెబ్ సైట్ లో కూడా ఆమె నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేత్తడి హారిక ఎవరో కూడా తనకు తెలియదని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది.అయితే ఈ వివాదంపై టీఎస్ఎండీసీ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా స్పందించారు.

హారికను అంబాసిడర్ గా తొలగించామని వచ్చిన వార్తలు అవాస్తవమని, తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఎవరో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని వారు స్పష్టం చేశారు.

అయితే దీనిపై దేత్తడి హారిక ఏమీ స్పందించకున్నా టీఎస్ఎండీసీ ఛైర్మన్ స్పందనతో ఈ వివాదానికి పులిస్టాప్ పడింది.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు