కాంగ్రెస్ నేతల అవమానం... శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య

రాజకీయాలలో అసెంబ్లీ, లోక్ సభ, విధాన సభ, శాశన మండలిలో అవమానాల పర్వాల సర్వ సాధారణం.

ఒక పార్టీ నాయకులు మరో పార్టీ నాయకులపై మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తారు.

ఒక్కోసారి ఇవి హద్దుమీరు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్తూ ఉంటారు.ఎక్కువగా ఇలాంటి అవమాన ఘటనలు తమిళనాడు రాజకీయాలలో జరుగుతూ ఉంటాయి.

డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల నేతలు ఒకరిని ఒకరు దారుణంగా అవమానించుకుంటారు.ఈ మధ్యకాలంలో ఏపీలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటి వాతావరణమే ఉంది.

ప్రతిపక్ష నేతచంద్రబాబుపై కనీసం రాయలేని రీతిలో అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు.బూతులు మాట్లాడుతారు.

Advertisement

హద్దులు మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.ఇప్పుడు ఏపీలో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ఎస్ఎల్ ధర్మెగౌడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ధర్మెగౌడ ఆచూకీ ఆ తర్వాత తెలియరాలేదు.దీంతో పోలీసులు, గన్‌మెన్ ఆయన కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఈ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

దీంతో రైలు కిందపడి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.మృతదేహం పక్కనే ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాసనమండలి చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఈ నెల 16న శాసనమండలిలో రభస జరిగింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

సభ్యులు ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది.సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లడం వివాదాస్పదమైంది.

Advertisement

ఈ క్రమంలో ఇప్పుడు ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

తాజా వార్తలు