కొత్త ట్రెండ్ సెట్ చేసిన కమలా హారిస్.. 60 ఏళ్ల సాంప్రదాయానికి చెల్లుచీటి !!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.

డెమొక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) తలపడుతున్నారు.

ఇప్పటికే వీరిద్దరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ముఖ్యంగా కమలా హారిస్ దూకుడుగా ముందుకెళ్తున్నారు.

ఓపీనియన్ పోల్స్‌తో పాటు నిధుల సేకరణ విషయంలోనూ కమల ముందున్నారు.ఇదిలాఉండగా.

ఈ ఏడాది అల్‌స్మిత్ ఛారిటీ డిన్నర్‌కు( Al Smith Charity Dinner ) గైర్హాజరు అవ్వడం ద్వారా 60 ఏళ్ల సాంప్రదాయానికి ఆమె తెరదించారు.మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అక్టోబర్ 17న తాను ఈ డిన్నర్‌కు హాజరవుతానని చెప్పారు.

Advertisement

క్యాథలిక్ ఛారిటీలకు( Catholic Charities ) ప్రయోజనం చేకూర్చేందుకే ఈ విందును నిర్వహిస్తారు.రిచర్డ్ నిక్సన్, జాన్ ఎఫ్ కెన్నెడీలు 1960 అధ్యక్ష ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నా.

అల్‌స్మిత్ డిన్నర్‌కు హాజరై సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేశారు.

ఈ ఐకానిక్ డిన్నర్ 79వ ఈవెంట్ అతిథుల జాబితాను ఆర్చ్ డియోసెస్ ప్రతినిధి జోసెఫ్ జ్విలెంగ్( Joseph Zwillng ) వెల్లడించారు.ఇంతలో తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని కమలా హారిస్ తెలపడంతో జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆమె ఈ కార్యక్రమానికి రావడం లేదని తెలిసి తాము నిరాశ చెందామన్నారు.

జాతి, మతం, నేపథ్యంతో సంబంధం లేకుండా మహిళలు, పిల్లలకు సహాయం చేసేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించినట్లుగా జోసెఫ్ పేర్కొన్నారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మరోసారి నిర్ణయాన్ని సమీక్షించాలని ఆయన కమలా హారిస్‌ను విజ్ఞప్తి చేశారు.అయితే నవంబర్ 5 ఎన్నికల్లో అధ్యక్షురాలిగా గెలిస్తే ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావాలని ఆమె ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.1928లో మొట్టమొదటి రోమన్ క్యాథలిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఆల్ఫ్రెడ్ ఈ స్మిత్ పేరును ఈ డిన్నర్‌కు పెట్టారు.ఈ విందు ద్వారా క్యాథలిక్ స్వచ్ఛంద సంస్థలకు మిలియన్లకొద్దీ నిధులను సమకూరుస్తుంది.

Advertisement

అధ్యక్ష అభ్యర్ధుల మధ్య స్నేహభావాన్ని పెంపొదించడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది.

తాజా వార్తలు