తెలంగాణలో నాటి నుంచి నేటి వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ( Chairman Allam Narayana ) సారధ్యంలో సాగిన ఉద్యమాల ఫలితంగా జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, నాడు వంట వార్పు నుంచి నేడు ఇళ్ల స్థలాల సాధన వరకు అనేక ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు , దీక్షలు చేపట్టిన ఘనత తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీజేఎఫ్ దేనని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు.
తమ సంఘం అనేక విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించి ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఆనాడు ఇచ్చిన హామీని నెరవేచ్చేందుకు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకలు ఖమ్మం ప్రెస్ క్లబ్( Khammam Press Club ) లో శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జాతీయ జెండాను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అట్టహసంగా ఆవిష్కరించారు.
ఈ వేదికలకు టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.జర్నలిస్టుల పక్షాన కొట్లాడి పోరాడేది తమ యూనియన్ అని, ఒక నిబద్ధతతో కూడిన భావజాలంతో ముందుకు వెళ్తున్నామని, తాము చేసిన పోరాట ఫలితంగా త్వరలో ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రాబోతున్నాయని అన్నారు.
కొందరు చేసే తప్పుడు ప్రచారాలను జర్నలిస్టులు నమ్మవద్దని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar )జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలు చేస్తారనే నమ్మకం జర్నలిస్టులలో ఉన్నదని, ఆయన కృషి ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అభివృద్ధి జరుగుతుందని, ఆకుతోటి ఆదినారాయణ ఇచ్చిన సూచనలు, సలహాలు మేరకు ప్రెస్ క్లబ్ కమిటీ కృషి చేయడం అభినందనీయం అన్నారు.
జర్నలిస్టులు ఐక్యతతో సమిష్టి కృషితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో భాగంగా పదవ తరగతిలో పదికి పది జిపిఏ మార్కులు సాధించిన టీఎస్9 జర్నలిస్ట్ శ్రీధర్ శర్మ కుమార్తె లక్ష్మీ ఆశ్రిత ను, సీనియర్ వార్త సబ్ ఎడిటర్ నారాయణ రావు, సీనియర్ జర్నలిస్ట్ శెట్టి విజేత, సీనియర్ మహిళా జర్నలిస్ట్ వంగూరి ఈశ్వరి, సీనియర్ ఫోటోగ్రాఫర్ స్టార్ శీను, ప్రముఖ రచయిత కవి కే.చిన్న నరసయ్య లకు పూలమాలలు అందించి శాలువాలతో మేమేంటో అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొర కొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కీ గోపి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, సహాయ కార్యదర్శి ఎస్ కే జానీ పాషా, జిల్లా నాయకులు ఉపేందర్, నగర ప్రధాన కార్యదర్శి అమరపు కోటేశ్వరరావు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యలమందల జగదీష్, జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, తిరుపతిరావు, రాజేంద్రప్రసాద్, ప్రెస్ క్లబ్ నేతలు ముత్యాల కోటేశ్వరరావు, జీవన్ రెడ్డి, యూనియన్ నేతలు పానకాలరావు రామారావు, మందుల వెంకటేశ్వర్లు, నరేష్, సంతోష్, ఉపేందర్, రోషి రెడ్డి, వెంకటరెడ్డి, కుమార్, నాయుడు సతీష్ వేణు గోపాల్, భారతి, రోజా, నల్లమోతు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎన్ వి, తదితరులు పాల్గొన్నారు.
Latest Khammam News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy