ఖ‌ర్జూరాన్ని ఇలా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతార‌ట‌..తెలుసా?

అధిక బ‌రువు అనేక స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంద‌ని అంద‌రికీ తెలుసు.అందుకే బ‌రువు త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

క‌ఠిన‌మైన డైట్‌ను ఫాలో అవుతారు.ప్ర‌తి రోజు చెమ‌ట‌లు చిందేలా వ్యాయామాలు చేస్తారు.

ఎన్నెన్నో నియ‌మాలూ పెట్టుకుంటారు.అయితే అధిక బ‌రువును క‌రిగించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో ఖ‌ర్జూరాలు ఉన్నాయి.అవును, ఖ‌ర్జూరాల ద్వారా కూడా బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

Advertisement
Dates Helps To Reduce Over Weight! Dates, Over Weight, Weight Loss Tips, Health

మ‌రి ఖ‌ర్జూరాల‌ను ఎలా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారు.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా ఖ‌ర్జూరం అద్భుత‌మైన రుచి క‌లిపి ఉండ‌ట‌మే కాదు.

ఐర‌న్‌, కాల్షియం, పోటాషియం, పాస్ప‌ర‌స్‌, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ కె ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా ఖ‌ర్జూరం ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా అధిక బ‌రువుతో బాధ ప‌డే వారు.ఖ‌ర్జూరంతో టీ త‌యారు తీచేసుకుని తీసుకుంటే చాలా మంచిది.

Dates Helps To Reduce Over Weight Dates, Over Weight, Weight Loss Tips, Health

పైగా ఖ‌ర్జూరం టీ త‌యారు చేయ‌డం కూడా క‌ష్ట‌మైన ప‌నేమి కాదు.ముందు ఐదురు ఖ‌ర్జూరాల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.ఇప్ప‌డు ఒక గ్లాస్ వాట‌ర్‌లో దంచిన అల్లం ముక్క మ‌రియు ఖ‌ర్జూరం ముక్క‌లు వేసి బాగా మ‌రిగించి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఫిల్ట‌ర్ చేసుకుంటే టీ సిద్ధ‌మైన‌ట్టే.ఈ ఖ‌ర్జూరం టీని రోజుకు ఒక సారి చ‌ప్పున తీసుకుంటే గ‌నుక‌.

Advertisement

శ‌రీరంలో పేరుకుపోయిన అద‌న‌పు కొవ్వు క్ర‌మంగా క‌రిగిపోతుంది.దాంతో మీరు చ‌క్క‌గా స‌న్న‌బ‌డ‌తారు.

ఇక ఈ ఖ‌ర్జూరం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఈ ఖ‌ర్జూరం టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.త‌ల‌నొప్పి, ఆల‌స‌ట‌, ఒత్తిడి, డిఫ్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.శ‌రీరానికి ఐర‌న్ పుష్క‌లంగా అంది.

ర‌క్త హీన‌త ప‌రార్ అవుతుంది.మ‌రియు కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.

తాజా వార్తలు