ప్రమాదకరంగా కరెంటు తీగలు-పట్టించుకోని విద్యుత్ అధికారులు

నల్లగొండ జిల్లా:తిరుమలగిరి(సాగర్)మండల( Tirumalagiri ) కేంద్రంలోని బీసీ కాలనీలో విద్యుత్ తీగలకి( Electric Wires ) చెట్లు అలుముకున్నాయి.

దీని వల్ల కరెంటు తీగల నుండి చెట్టుకు విద్యుత్ సరఫరా సులభంగా పాకుతుంది.

ఈ తీగలు బీసీ కాలనీ నుండి గ్రామంలోని మంచినీళ్లు బావి వరకు రోడ్డు పక్కన వ్యాపించి ఉన్నాయి.ఈ తీగల వలన ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్ వైర్ల బారిన మూగజీవాలు పడితే అవి మరణించే అవకాశం ఉంది.ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోక ముందే సంబంధిత అధికారులు శ్రద్ధ వహించి విద్యుత్ వైర్లు సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

సైరన్ తో వచ్చేది పోకిరీలా...పోలీసులా...?
Advertisement

Latest Nalgonda News