బొప్పాయిని ఇలా తింటే డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే?

ఎంతో టేస్టీగా ఉండే బొప్పాయిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు.

పొటాషియం, మెగ్నిషియం, కాపర్‌, ఫైబర్ వంటి పోష‌కాల‌తో పాటు విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా బొప్పాయిలో పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షించ‌డంలో, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను క‌రిగించ‌డంలో, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలో ఇలా ఎన్నో ర‌కాలుగా బొప్పాయి ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.అతిగా తీసుకుంటే మాత్రం డేంజ‌ర్‌లో ప‌డాల్సి వ‌స్తుంది.అవును! బొప్పాయిని ఆరోగ్యానికి మంచిది క‌దా అని ఎక్కువ‌గా తీసుకుంటే.

ఊహించ‌ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మ‌రి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Dangerous Side Effects Of Papaya! Side Effects Of Papaya, Papaya, Latest News,

బొప్పాయిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి, స్టమక్ అప్ సెట్,గ్యాస్ట్రిక్ సమస్యలు త‌లెత్తుతాయి.ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు బొప్పాయికి ఎంత దూరంగా ఉంటే.

అంత మంచిది.

Dangerous Side Effects Of Papaya Side Effects Of Papaya, Papaya, Latest News,

ఎందుకంటే.ఇలాంటి వారు బొప్పాయిని తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్యలు మ‌రింత ఎక్కువ అవుతాయి.బొప్పాయిలోని పొపైన్ అనే మూలకమే ఇందుకు కారణమ‌ని అంటున్నారు.

అలాగే మ‌గ‌వారు బొప్పాయి అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.అందుకే మితంగా మాత్రమే బొప్పాయిని తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఇక బొప్పాయి ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ఘోరంగా ప‌డిపోతాయి.త‌ద్వారా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.

Advertisement

అదేవిధంగా, కొంద‌రికి బొప్పాయి అతిగా తీసుకుంటే.చర్మంలో దద్దర్లు ఏర్పడ‌టం, అలర్జీ వంటి స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి.

అలాగే నెల‌ల పిల్ల‌ల‌కు బొప్పాయిని పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.బొప్పాయి ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ ప్రెజ‌ర్ లెవ‌ల్స్ కూడా పెరిగిపోతాయి.

కాబ‌ట్టి, బొప్పాయి లిమిట్‌గా మాత్ర‌మే తీసుకోవాలి.

తాజా వార్తలు