అశ్వగంధ ఆరోగ్యానికి మంచిదే.. కానీ అలా వాడితే చాలా డేంజ‌ర్‌..!

అశ్వగంధ.ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌.ఆయుర్వేద వైద్యం లో విరి విరిగా ఉప‌యోగించే అశ్వగంధకు.

కింగ్ ఆఫ్ ఆయుర్వేద అనే పేరు కూడా ఉంది.ఆరోగ్య ప‌రంగా అశ్వ‌గంధ ఎంతో మేలు చేస్తుంది.

ఒత్తిడిని త‌గ్గించ‌డంలోనూ, క్యాన్స‌ర్‌కు అడ్డు క‌ట్ట వేయ‌డంలోనూ, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ, రక్త పోటును అదుపు చేయ‌డంలోనూ.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా అశ్వ‌గంధ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అందు వ‌ల్ల‌నే, చాలా మంది అశ్వ‌గంధను ఏదో ఒక రూపంలో రెగ్యుల‌ర్‌గా తీసుకుంటారు.అయితే అశ్వగంధ ఆరోగ్యానికి మంచిదే.

Advertisement

కానీ, ప‌రిమితికి మించి యూజ్ చేస్తే మాత్రం చాలా డేంజ‌ర్‌.అవును, అశ్వగంధ అధికంగా వినియోగిస్తే అనేక స‌మ‌స్య‌లు చుట్టు ముట్టేస్తాయి.

మ‌రి లేటెందుకు ఆ స‌మ‌స్య‌లేంటో ఓ లుక్కేసేయండి.సాధార‌ణంగా అశ్వగంధ తీసుకుంటే రక్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి.

మ‌ధుమేహం రోగుల‌కు ఇది వ‌ర‌మే.కానీ, మ‌ధుమేహం వ్యాధి లేని వారు అశ్వగంధను ఓవ‌ర్‌గా తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ తీవ్రంగా ప‌డిపోయి ప్రాణాల మీద‌కు తెచ్చి పెడుతుంది.

అలాగే అశ్వగంధను ప‌రిమితికి మించి యూజ్ చేస్తే పురుషుల్లో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం, లైంగిక శ‌క్తి కోల్పోవ‌డం వంటివి జ‌రుగుతాయి.ఫ‌లితంగా సంతాన లేమికి దారి తీస్తుంది.అశ్వగంధను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల‌.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

హైప‌ర్ థైరాయిడ్, లివ‌ర్ వ్యాధులు, ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ పెరిగి పోతుంది.

Advertisement

అంతే కాదు, కొంద‌రిలో నోరు పొడి బారి పోవ‌డం, స్త్రీల‌లో ర‌క్త‌స్రావం అవ్వ‌డం, చ‌ర్మ అల‌ర్జీలు తలెత్త‌డం వంటివి జ‌రుగుతాయి.మ‌రియు అశ్వగంధను ఎక్కువ‌గా తీసుకుంటే అతినిద్ర వ్యాధికి గుర‌య్యే అవ‌కాశాలు సైతం ఉన్నాయి.అందుకే ఆరోగ్యానికి ఎంత మంచి చేసిన‌ప్ప‌టికీ.

అశ్వ‌గంధ‌ను లిమిట్‌గా తీసుకోవ‌డం చాలా ముఖ్యం.లిమిట్‌గా తీసుకుంటేనే అన్ని ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

తాజా వార్తలు