నాట్యమాడిన పిల్లలమర్రి

సూర్యాపేట జిల్లా:ఔను సూర్యాపేట రూరల్ మండలంలోని పిల్లలమర్రి గ్రామంలో చిన్నా,పెద్దా, ముసలి ముతకా, ఆడ,మగ,విద్యార్ది, ఉద్యోగులు,పేద,ధనిక అనే అంతరం లేకుండా, పార్టీలకతీతగా నాయకులు,కార్యకర్తలు అనే భేదం లేకుండా సురేందర్ డీజేకు దుమ్ము లేపే డాన్స్ చేశారు.

పిల్లలమర్రిలో శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారు జామున రథోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా హాజరయ్యారు.ఐదు పదుల వయస్సున్న వాళ్ళు మా చిన్న తనంలో చెన్నకేశవస్వామి తిర్ణాల బాగా జరిగేదని,మళ్ళా అంత సంతోషంగా ఇప్పుడు చూస్తున్నామంటూ స్టేప్పులేశారు.

మొత్తానికి అత్యంత ఉత్సహంగా వైభవంగా రథోత్సవం జరిగింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

Latest Suryapet News