బీజేపీ నాయకురాలి దూకుడు ! సొంత పార్టీ నాయకుడిపై జగన్ నిఘా ?

కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ మీద బీజేపీ నాయకులు మాటల తూటాలు వదులుతున్నారు.

జగన్ ను లక్ష్యం గా చేసుకుని ప్రభుత్వ పథకాల్లోని లొసుగులను హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

అయినా జగన్ పార్టీ నుంచి బీజేపీ మీద ఎటువంటి కౌంటర్లు వేయడంలేదు.అయినా బీజేపీ నాయకులు వెనక్కి తగ్గకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందరేశ్వరి వైసీపీ మీద విమర్శలు గుప్పించారు.అయితే ఆమె మాటలు వైసీపీ పెద్ద సీరియస్ గా తీసుకోకపోయినా ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు మీద నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

పురందరేశ్వరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలో ఉంటే, భర్త రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ.ఇద్దరూ ఎవరి రాజకీయంలో వారు బిజీగా వున్నారు.

Advertisement

అయితే ఒకే ఇంట్లో రెండు జెండాలున్నా వీరు సఖ్యతగానే వున్నారు కానీ, పార్టీల అధినాయకుల్లోనూ అపార్థాలు పెరుగుతున్నాయట.

భార్య భర్తలు వేరు వేరు పార్టీల్లో ఉన్నా ఎవరి పని వారు చేసుకుంటున్నారు.ఎన్టీఆర్ అల్లుడిగా రాష్ట్రంలో ఒకస్థాయి ఉన్న రాజకీయ నాయకుడిగా దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు గుర్తింపు ఉంది.చంద్రబాబుకు వ్యతిరేకంగా దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరగా, మొన్నటి ఎన్నికల వరకు సైలెంట్ గా ఉన్న వెంకటేశ్వరరావు కుమారుడితో కలిసి వైసీపీలోకి వెళ్లారు.

అయితే పరుచూరి నుంచి దగ్గుపాటి కుమారుడు హితేష్ ను రంగంలోకి దించాలని చూసినా అది సాధ్యం కాలేదు.దీంతో తప్పని పరిస్థితుల్లో దగ్గుపాటి పోటీ చేశారు.అయితే ఆయనకు ఓటమి తప్పలేదు.

అయినా పార్టీ అధికారంలో ఉండడంతో దగ్గుపాటి హావ నడుస్తూనే ఉంది.కొద్ది రోజుల క్రితం దగ్గుబాటి ఆయన కుమారుడు కలిసి మండలాల వారీగా,అధికారులు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ తమ హవా చూపిస్తున్నారట.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

ఇది కొంచెం అతిగా మారిందన్న విమర్శలతో దగ్గుబాటి వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.సీఎం జగన్‌ కూడా ఈ వ్యవహారాలపై ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఇక నిఘా విభాగం అధికారులు ప్రత్యేకంగా ఆ నియోజక వర్గంలో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారట.

Advertisement

సొంత పార్టీ నాయకుడిపై అదే పార్టీ ప్రభుత్వం ఎందుకు నిఘా పెట్టిందన్న విషయాన్ని కూడా బీజేపీ ఆరాతీస్తోందట.ఎన్నికల వరకు బీజేపీ, వైసీపీ మధ్య సఖ్యత బాగానే వున్నా, ఏపీలోనూ బలపడాలనుకుంటున్న బీజేపీ, జగన్‌ ప్రభుత్వంపై విమర్శల వాడిని పెంచింది.

ఆ నేపథ్యంలోనే కన్నాతో పాటు అనేకమంది బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ క్రమంలో పురందేశ్వరి కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు.సరిగ్గా ఇదే సమయంలో దగ్గుపాటి వెంకటేశ్వరావు మీద ఈ రేంజ్ లో నిఘా పెట్టడం వెనుక రాజకీయ కారణాలు ఎవరికీ అంతు పట్టడంలేదు.

తాజా వార్తలు