డాడీ సినిమాలో చిరంజీవి కూతురిని ఇప్పుడు చూస్తే మతి పోతుంది...

తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన "డాడీ" అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

 అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా, సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు.

అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, స్వర్గీయ నటుడు ఎమ్మెస్ నారాయణ, అల్లు అర్జున్ (గెస్ట్ అప్పియరెన్స్) తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.

Anushka Malhotra, Child Artist, Daddy Movie, Megastar Chiranjeevi Daughter, To

అయితే అందరికీ ముందుగా డాడీ చిత్రం అంటే ఈ చిత్రంలో పాప పాత్రలో నటించిన అక్షయ గుర్తొస్తుంది.అయితే ఈ చిత్రంలో అక్షయ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు అనుష్క మల్హోత్రా.

కాగా అనుష్క మల్హోత్రా స్వస్థలం మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై.కానీ టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలిసిన వారి ద్వారా డాడీ సినిమాలో అనుష్క మల్హోత్రా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

Advertisement

అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంతమేర నిరాశ పరిచినప్పటికీ అనుష్క  మల్హోత్రా పాత్రకి మాత్రం సినీ   విమర్శకుల నుంచి  మంచి మార్కులు పడ్డాయి.అంతేగాక బాలీవుడ్లో పలు సినీ అవకాశాలు కూడా తలుపు తట్టాయి.

కానీ అనుష్క మల్హోత్రా తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పుడే సినిమాల్లోకి వెళితే తన చదువుకి భంగం కలుగుతుందని కొంత కాలం పాటు సినిమాల్లో నటించడం మాన్పించేశారు.అయితే ప్రస్తుతం అనుష్క మల్హోత్రా చదువులో డిగ్రీని పూర్తి చేసుకొని సినిమాలవైపు వస్తోంది.

అంతేగాక ప్రస్తుతం మోడలింగ్ రంగంలో కూడా పని చేస్తోంది.అయితే తాజాగా ఈ అమ్మడు కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు