బోక్ చోయ్ పంటను సాగు చేసే విధానం.. పెట్టుబడి తక్కువ- లాభాలు ఎక్కువ..!

బోక్ చోయ్ ను( Bok Choy ) చైనీస్ క్యాబేజీ( Chinese Cabbage ) అని కూడా పిలుస్తారు.

ఈ పంటను విదేశాలలో విస్తృతంగా సాగు చేస్తారు.

వేసవికాలం చివరలో నాటుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు.ఈ పంట సాగు చేయడానికి అధిక తేమ ఉండే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి.

ఇటువంటి ప్రాంతాలలో స్వల్ప వర్షపాతం ఉంటే చాలు సాగు చేయవచ్చు.నేలలో విత్తనాలు విత్తిన నాలుగు నుంచి 8 రోజులలోనే మొలకలు వస్తాయి.

ఆరోగ్యపరంగా బోక్ చోయ్ ను అధికంగా తింటూ ఉండడంతో ఎక్కువగా నర్సరీలలో ఈ మొక్కలను పెంచి విక్రయిస్తున్నారు.

Advertisement

ఈ పంటను సాగు చేయడానికి సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమే.ముఖ్యంగా పీహెచ్ విలువ 6.5 నుంచి 7 వరకు ఉండే భూములు చాలా అనుకూలం అని చెప్పవచ్చు.ఈ పంటను ఒకేసారి విత్తుకోకుండా దశలవారీగా విత్తుకుంటే మార్కెటింగ్ చేయడానికి కాస్త సౌకర్యంగా ఉంటుంది.

విత్తనాలను హైడెన్సిటీ ( High Density ) విధానంలో నాటుకుంటే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.ఇక నీటిపారుదల వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి.నీరు పారించిన తర్వాత నేలపై ఎక్కడ నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ పై దృష్టి పెట్టాలి.

నీటిని రాత్రి సమయాలలో కాకుండా కేవలం పగటి పూట మాత్రమే పంటకు అందించాలి.

బోక్ చోయ్ పంట సాగు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు.రసాయన పద్ధతిలో అధిక దిగుబడి సాధించడం అసాధ్యం.నేలలో పొటాషియం, నత్రజని, భాస్వరం అధికంగా ఉంటే తక్కువ మోతాదులో ఎరువులను ఉపయోగించాలి.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
వైరల్ వీడియో : బిగ్ బాస్ హౌజ్ లో పాము కలకలం..

ఈ బోక్ చోయ్ పంటలలో కూడా చాలా రకాలు ఉన్నాయి.ఈ పంటను సాగు చేసే నేల రకాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.

Advertisement

ఇక పంట చేతికి వచ్చాక పంట కోతలు చేసేటప్పుడు ఒక్క అంగుళం పైకి కత్తిరించడం ద్వారా తిరిగి రెండో కాపు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది.పైగా మొదటి కాపు కంటే రెండవ కాపు లో వచ్చిన కూరగాయలే ఎక్కువగా రుచికరంగా ఉంటాయి.

కేవలం విత్తుకున్న రెండు నెలలకే మొక్కలు కోతకు వస్తాయి.

తాజా వార్తలు