Designer prasanna varma : పైట కొంగుతో హీరోల చొక్కాలు.. ఉప్పెనలో వైష్ణవ్ ధరించిన చొక్కాల వెనుక ఇంత కథ ఉందా?

వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) హీరోగా నటించిన ఉప్పెన సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

ఇందులో వైష్ణవ్ తేజ్ చిల్లుల బని నువ్వు పూల చొక్కా వేసుకున్న విషయం తెలిసిందే.

ఆ సన్నివేశాలు ఇంకా చాలామందికి కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి.అయితే మనకి ఆ పాత్రల్ని గుర్తుండిపోయేలా చేసిన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మరెవరో కాదు.

తెలుగమ్మాయి ప్రసన్నవర్మ( Designer prasanna varma ) డిజైనర్‌గా తన ప్రయాణాన్ని మనతో పంచుకుంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రసన్న వర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కాలేజీలో ఉన్నప్పుడు హీరోయిన్‌లు వేసుకున్న డ్రెస్సులు చూడ్డానికే సినిమాలకెళ్లేదాన్ని.ఆ ఇష్టం కాస్త నా కెరియర్‌నే మలుపు తిప్పుతుందని అనుకోలేదు.

Advertisement

మాది భీమవరం.అమ్మ పద్మావతి, నాన్న రామకృష్ణంరాజు.

మాకు చేపల చెరువులున్నాయి.వాటిని చూసుకుంటున్నారు.

ఒక తమ్ముడు.భీమవరంలో ఇంటర్‌ వరకు చదివాక డిజైనింగ్‌పై ఆసక్తికొద్దీ హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేశాను.

ఆ తర్వాత దుబాయ్‌లోని ది కాలేజీ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ డిజైన్‌ లో ఎంబీఏ పూర్తిచేశాను.సినిమాల్లో పనిచేస్తానంటే నాన్న ఒప్పుకోలేదు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

బెంగళూరులో పీటర్‌ ఇంగ్లాండ్‌ మెన్స్‌వేర్‌లో డిజైనర్‌గా పనిచేసినా ఆ పని నాకు సంతృప్తినివ్వలేదు.దాంతో ఏడాది తిరక్కుండానే మానేశను.

Advertisement

నాకు బొమ్మలు వేయడమన్నా ఇష్టమే.

నేను వేసిన ఒక పెయింటింగ్‌ డైరెక్టర్‌ పూరీగారి వరకూ వెళ్లింది.అదే నా జీవితంలో పెద్ద మలుపు.అది బాగుందని ఫోన్‌ చేసి ఇంటికి ఆహ్వానించి, ప్రశంసించారు.

ఆ పరిచయం నన్ను సినిమాలవైపు ప్రోత్సహించింది.కానీ తొలి అవకాశం మాత్రం వేరొకరి రూపంలో వచ్చింది.

నటుడు రాజా రవీంద్ర మాకు బంధువు.ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇంత టాలెంట్‌ ఉంది, సినిమాల్లో ఎందుకు చేయకూడదని అన్నారు.

అలా 2018లో నిఖిల్‌ చేసిన కిరాక్‌ పార్టీ సినిమాలో అవకాశం అందుకున్నాను ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో ఏడాదిపాటు ఇంటి ముఖమే చూడనంత బిజీ అయిపోయాను.ఇక జాంబిరెడ్డి చిత్రంలో ప్రధాన పాత్రలకే కాకుండా వందలకొద్దీ జాంబీ పాత్రలకు దుస్తులు డిజైన్‌ చేయడం మర్చిపోలేను.

అలాగే మామా మశ్చీంద్ర, చోర్‌బజార్‌, అర్జున ఫల్గుణ( Arjuna Phalguna ), యాత్ర సహా 14 చిత్రాలకు పనిచేశాను.

ఇక జాతీయ పురస్కారం సాధించిన ఉప్పెన గురించి చెప్పాలంటే ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు( Buchi Babu Sana ) ఫోన్‌ చేసి హీరో వైష్ణవ్ తేజ్‌ పాత్ర గురించి చెప్పి కొత్త లుక్‌ తీసుకురావాలన్నారు.మామూలుగా అయితే పాత్రల స్టైల్‌, ఆహార్యం వంటివి ముందుగా స్కెచ్‌ వేసి దర్శకుడికి చూపిస్తాను.ఈ సినిమాకి అలా చేయలేదు.

నేరుగా కాకినాడలోని షూటింగ్‌ స్పాట్‌కికెళ్లారు.ఆ పరిసరాలు చూడగానే చిన్నప్పుడు నేను చూసిన రంగుల పూల చొక్కాల జాలర్లు గుర్తొచ్చారు.

ఆ స్టైల్‌లో చూపించాలనుకున్నాను.అందుకే హీరో చొక్కాల కోసం చీరలని ఎంచుకున్నాను.

సిల్క్‌, జార్జెట్‌, క్రేప్‌ చీరలు తీసుకుని వాటి పైట అంచులతో చొక్కాలు కుట్టించాను.ఇంకా మాస్‌ లుక్‌ రావాలని హీరో ధనుష్‌ ధరించే చిల్లుల బనియన్లు లాంటివి వెతికాము.

రంగులవి దొరక్క, తెలుపు వాటికి డై వేయించా.దీంతో పాత్రకు తగ్గట్లు సరిగ్గా కుదిరాయి.

సినిమా విడుదలయ్యాక ఆ చొక్కాలు ఎక్కడ దొరికాయి అంటూ ఒకటే ప్రశంసలు అని సంతోషంతో చెప్పుకొచ్చింది ప్రసన్న వర్మ.

తాజా వార్తలు