ఎమ్మెల్యే చేసిన పనితో డేంజర్‌లో లక్ష మంది

రెండు వారాల క్రితం లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కూడా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను వినియోగించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

ఆ ఎఫెక్ట్‌ గట్టిగా పడ్డట్లుంది.

దాదాపుగా రెండువేల మంది పాల్గొన్న ఆ కార్యక్రమం వల్ల ఇప్పుడు శ్రీకాళహస్తికి చెందిన లక్ష మంది ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.అక్కడ మొన్నటి వరకు జీరో ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

ఎమ్మెల్యే చేసిన కార్యక్రమంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తి పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ఇంతగా శ్రీకాళహస్తిలో కరోనా విజృంభించినట్లుగా స్థానికులు అంటున్నారు.

ఎమ్మెల్యే నిత్యవసరాలు పంచిపెట్టడం ఏమో కాని ఇలా కరోనా అంటించాడంటూ స్థానికులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆయన తీరుపై నాయకత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Advertisement

ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు