దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త సబ్ వేరియంట్ జెఎన్.1 గుర్తింపు

భారత్ లో మరోసారి కరోనా( Corona ) కలకలం చెలరేగింది.ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కేరళతో ( Kerala )పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త సబ్ వేరియంట్ జెఎన్.1( JN.1 ) ను గుర్తించింది.పండుగల సీజన్ నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.

ఈ క్రమంలోనే గతంలో జారీ చేసిన కోవిడ్ -19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది.

పాజిటివ్ శాంపిళ్లు అన్నింటనీ జీనోమ్ సీక్వెన్సింగ్( Genome Sequencing ) చేయాలని తెలిపింది.అలాగే ఆర్టీ- పీసీఆర్ సహా అన్ని రకాల టెస్టులకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే జెఎన్-1 సబ్ వేరియంట్ ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించడం లేదని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఆస్పత్రుల సన్నద్ధతపై రేపు రాష్ట్రాలతో కేంద్రం సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు