బీహార్ మాజీ మంత్రిని బలి తీసుకున్న కరోనా.. !

బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, అధికార జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌద‌రీ (71) సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు.

గ‌త‌వారం క‌రోనా బారిన ప‌డిన మేవాలాల్ మూడు రోజుల క్రితం పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారట.

కాగా మేవాలాల్ చౌద‌రీ, ముంగర్ జిల్లాకు చెందిన వారు.అయితే ప్రస్తుతం తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నారు.

ఇకపోతే గతేడాది నవంబర్ లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న విషయం విదితమే.ఇక సీఎం నితీశ్ కుమార్, మాజీ మంత్రి మేవాలాల్ చౌద‌రి మృతిప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తంచేస్తూ, ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు.

Advertisement
వీడియో: ఫిమేల్ బ్యాంక్‌ మేనేజర్‌పై కస్టమర్ ప్రతాపం.. ఆమె ఫోన్ బద్దలు కొట్టాడు..!

తాజా వార్తలు