ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు వైసిపి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపనుంది.మేటర్ ఏమిటంటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు “జగనన్న విద్యా దీవెన” కింద విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు.
అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ అందించనున్నారు.ఈరోజు తాడేపల్లి లో తన క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా నేరుగా డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జమ చేసే రీతిలో సీఎం జగన్ వ్యవహరించనున్నారు.
దీంతో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 10.88 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ సొమ్ము బదిలీ కానుంది.రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద రూ.671.45 కోట్లు కేటాయించిన జగన్ ప్రభుత్వం నేరుగా.విద్యార్థుల పట్ల ఖాతాల్లోకి డబ్బును జమ చేయనున్నారు.మొత్తంమీద చూసుకుంటే ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన లెక్క రూ.4,879 కోట్లు.ఇక ఇదే నెలలో ఏప్రిల్ 28 వ తారీఖున వసతి దీవెన మొదటి విడత కార్యక్రమాన్ని కూడా ఏపీ ప్రభుత్వం లాంచ్ చేయనున్నట్లు సమాచారం.