గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ

మీరు పోరాటం చేయండి.మీ పోరాటానికి మా తోడ్పాటునందిస్తాం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి( KK Mahender Reddy ) గ్రామ పంచాయితీ కార్యదర్శుల పై రాష్ట్ర సర్కార్ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలన్న కేకే.

కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కుల దినోత్సవం మేడే రోజే జేపిఎస్ లు సమ్మె చేయడం బాధాకరమని వెల్లడి.

చిన్న పోస్ట్ అయిన పెద్ద చదువులు చదివిన వారు గ్రామపంచాయితీ కార్యదర్శులంటు పేర్కొన్న మహేందర్ రెడ్డి.పల్లెల డెవలప్మెంట్ విషయంలో జేపీఎస్ లది కీలక పాత్రని వెల్లడి.

రాజన్న సిరిసిల్ల జిల్లా:పల్లెల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది వీరైతే.ఫలితం మాత్రం రాష్ట్ర ప్రభత్వానికా అంటూ మండిపడ్డారు కేకే మహేందర్ రెడ్డి.

జేపీఎస్ ల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బరోసానిచ్చారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సమ్మెలో ఉన్న జేపీఎస్ లతో కూర్చొని మద్దతు ప్రకటించిన కేకే, కాంగ్రెస్ పార్టీ( Congress party ) నేతలు.

Advertisement

ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ జేపీఎస్ లవి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దేశ స్థాయిలో గ్రామాలకు గుర్తింపు తెచ్చిన ఘనత గ్రామ పంచాయతీ కార్యదర్శులదని,దేశ స్థాయిలో గ్రామాలకు అవార్డులు తెచ్చిన పంచాయతి కార్యదర్శుపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.

ప్రజా సౌమ్యబద్దంగ,ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న ప్రశ్నించే గొంతులను అనగదోక్కడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు.ప్రోబిషనరి కాలం పూర్తి అయిన కూడా వీరికి న్యాయం చేయకపోవడం సిగ్గుచేటు అని న్యాయ బద్దమైన హక్కులు వారివి, జేపిఎస్( JPS ) లను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు.

చాలీచాలని జీతాలతో పల్లెల అభివృద్ధికి పాటుపడిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల పై ముమ్మాటికీ కక్ష్య సాధింపు చర్యలేనని,పల్లెల అభివృద్ధి దేశానికి ప్రగతి.అలాంటి పల్లెల అభివృద్ధిలో తమదైన పాత్ర పోషించిన జెపిఎస్ లకు న్యాయం చేయకపోతే ప్రగతి దెబ్బతినడం ఖాయమన్నారు.

బంగారు తెలంగణ కాదు బతుకు మెతుకుల తెలంగాణా ప్రజలు కోరుుంటున్నారని ప్రభుత్వం మెడలు వంచైనా సరే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.తెలంగాణ లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సబ్బండ వర్గాలకు అప్పుడే సరైన న్యాయం జరుగుతుందన్నారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News