టీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ.. ?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో ఇక్కడ ప్రచారం ఊపందుకుంది.ముఖ్యంగా మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోరు కొనసాగుతుంది.

ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే ఓటర్లకు ఆశ్చర్యం వేస్తుందట.ఇక మా పార్టీ గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని ఊకదంపుడు మాటలు చెప్పే నేతలు, గెలిచాక అభివృద్ధి మాట అటుంచితే కనీసం ఓటర్ల వైపు కన్నెత్తి కూడా చూడరన్న విషయం తెలిసిందే.

Congress Mp Revanth Reddy Sentational Comments On Trs Bjp, Congress MP, Revanth

ఇదిలా ఉండగా వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.సెకండ్ క్యాపిటల్‌గా వరంగల్‌ను డెవలప్‌‌ చేయడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని, ఓటు బ్యాంకు కోసం బీజేపీ నేతలు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇక ఏదో చేస్తారని బండి సంజయ్ని గెలిపిస్తే, వారి స్వార్ధం కోసం పని చేస్తున్నారే తప్పా సామాన్య ప్రజల కోసం ఆలోచించడం మానేసారు.అదీగాక వరద బాధితుల ఊసే ఎత్తకపోవడం ఏంటని నిలదీశారు.

Advertisement
దొడ్డి దారిన విదేశాలకు .. 3,225 మంది ట్రావెల్ ఏజెంట్లపై పంజాబ్ సర్కార్ కేసులు

తాజా వార్తలు