వేములవాడ బీజేపీలో గందరగోళం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఆ పార్టీకి చెందిన కీలక నేత వికాస్ రావు నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు.

అయితే వేములవాడ నియోజకవర్గ టికెట్ ను పార్టీ అధిష్టానం తుల ఉమకు కేటాయించింది.ఈ క్రమంలో టికెట్ ఆశించిన వికాస్ రావు కొంత అసంతృప్తికి లోనయ్యారు.

అయినప్పటికీ చివరి నిమిషంలో అయినా తనకు టికెట్ కేటాయిస్తారని వికాస్ రావు భావించినప్పటీకి నిరాశే ఎదురైందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో టికెట్ రాకపోయినా నామినేషన్ వేసేందుకు వికాస్ రావు సిద్ధం అయ్యారని సమాచారం.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు