ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. సభ వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది.టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మధ్య వివాదం తలెత్తింది.

అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పినట్లు సైగ చేయడంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలోనే పొడియం వద్దకు వెళ్లి బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ నేపథ్యంలోనే చూసుకుందాం రా అంటూ సవాల్ చేశారు.

బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలని, ఇక్కడ కాదని సూచించారు.అనంతరం వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాలకృష్ణను చూస్తూ తొడగొట్టారు.

Advertisement

దీంతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో సభను స్పీకర్ వాయిదా వేశారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు