జలుబు వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారిందా? అయితే ఈ వాటర్ మీరు తాగాల్సిందే!

ప్రస్తుత చలికాలంలో అత్యంత కామన్ గా వేధించే సమస్యల్లో జలుబు ముందు వరుసలో ఉంటుంది.

పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ జలుబు తీవ్రంగా మదన పెడుతుంటుంది.

పైగా ఒక్కోసారి జలుబు వల్ల శ్వాస తీసుకోవడానికి సైతం చాలా ఇబ్బందిగా మారుతుంది.అలాంటి సమయంలో ఊపిరి సరిగ్గా అందక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు.

దీనివల్ల రాత్రుళ్ళు సరైన నిద్ర కూడా ఉండదు.అయితే అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ ను కనుక తీసుకుంటే జలుబు పరార్ అవ్వ‌డ‌మే కాదు శ్వాస సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం జలుబును తరిమికొట్టే ఆ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు లవంగాలు, ప‌ది మిరియాలు, నాలుగు యాలకులు, అంగుళం దాల్చిన చెక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ లవంగాలు, మిరియాలు, యాలకులు, మరియు దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగ అయిన‌ తర్వాత నేరుగా సేవించాలి.జలుబును తరిమికొట్టే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఈ వాటర్ లో పుష్కలంగా ఉంటాయి.

రోజుకు రెండుసార్లు ఈ వాటర్ ను తీసుకుంటే జలుబు నుంచి ఈజీగా బయటపడొచ్చు.అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.శ్వాస కూడా ఫ్రీగా అందుతుంది.

అంతేకాదు ప్రస్తుత వింటర్ సీజన్ ఈ వాటర్ ను రోజూ కనుక తీసుకుంటే రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.జలుబు, దగ్గు తదితర వ్యాధులు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు