టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు.చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.
ఈ సినిమా నేడు అనగా జనవరి 14 న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే మరొక హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే.చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులలో ఉత్కంఠ మొదలైంది.
అయితే వాల్తేరు వీరయ్య సినిమాని అభిమానులు చూడడానికి ఎందుకు తప్పకుండా చూడాలి అనడానికి 5 కారణాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

90 దశకంలో చిరంజీవి ఎలాంటి మాస్ సినిమాలు చేశారో ఆ వైబ్స్ వాల్తేరు వీరయ్యలో కనిపించనున్నాయి.అలాగే ఇందులో మాస్, కామెడీ, యాక్షన్ మిక్స్ చేసిన చిత్రం మెగాస్టార్ స్ట్రాంగ్ జోన్ అనే చెప్పాలి.అలాగే మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ అనే రీమేక్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.దాంతో చిరంజీవి ఎక్కువగా రీమేక్ కథలె ఎంచుకుంటున్నారు అన్న విమర్శలు మొన్నటి వరకు వినిపించిన విషయం తెలిసిందే.
కానీ వాల్తేరు వీరయ్య రిమేక్ కాదు.ఒరిజినల్ స్టోరీ.
అలాగే మెగా అభిమానులను సినిమాలో ఎంతగానో ఆకర్షించే అంశం చిరంజీవి రవితేజ కాంబినేషన్.

ఇందులో మాస్ మహారాజ్ రవితేజ 40 నిమిషాల నిడివి ఉండే గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు.వైజాగ్ లో గట్టి వేటగాడు లేక ఒక పులి పూనకాలతో ఊగుతోందట అంటూ రవితేజ ట్రైలర్ లో చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.అయితే 2000 లో విడుదలైన అన్నయ్య సినిమా తర్వాత చిరు, రవితేజ కలసి నటించిన సినిమా ఇదే.అలాగే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసిన విషయం తెలిసిందే.ఆ సినిమా ప్రభావం ఇంకా మెగా అభిమానులను వెంటాడుతూనే ఉంది.
దీంతో మెగా అభిమానులు ఆశలు మొత్తం ఈ సినిమా పైన పెట్టుకున్నారు.







