కొబ్బ‌రి నూనెతో ఇలా చేస్తే..మీ దంతాలు తెల్ల‌గా మెర‌వ‌డం ఖాయం!

దంతాలు తెల్ల‌గా మెరుస్తూ ఉంటే.ఎంత అందంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మిల‌మిల మెరిసే దంతాలు.

మ‌న న‌వ్వును మ‌రింత అందంగా చూపిస్తాయి.

కానీ.స్వీట్లు, జంక్‌ ఫుడ్‌, కూల్ డ్రింక్స్‌ ఇలా కొన్ని కొన్ని ఆహారాల తీసుకోవ‌డం వ‌ల్ల, బ్యాక్టీరియా పేరుకుపోవ‌డం వ‌ల్ల‌ కొంద‌రి దంతాలు గార ప‌ట్టేసి కాంతిహీనంగా మారిపోతాయి.

దాంతో దాంతాను తెల్ల‌గా మార్చుకునేందుకు ఎంతో ఖ‌రీదైన టూత్ పేస్ట్‌లు, మౌత్ వాష్‌లు.ఏవేవో వాడుతుంటారు.

Advertisement

అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుంటే ఎంత‌గానో బాధ ప‌డుతారు.అయితే అలాంటి వారు కొబ్బ‌రి నూనెను వాడ‌టం ఎంతో మేలు.

కేశ సంర‌క్ష‌ణ‌కు, ఆరోగ్యానికి, చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంతో మేలు చేసే కొబ్బ‌రి నూనె.దంతాల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా దంతాల‌ను తెల్ల‌గా మెరిసేలా చేయ‌డంలో కొబ్బ‌రి నూనె ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.మ‌రి కొబ్బ‌రి నూనెను దంతాల‌కు ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గిన్నెలో మూడు స్పూన్ల‌ స్వ‌చ్చ‌మైన కొబ్బ‌రి నూనె తీసుకుని హీట్ చేయాలి.ఇప్పుడు హీట్ చేసిన ఆయిల్ చ‌ల్ల‌గా మ‌రిన త‌ర్వాత అందులో బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంతో ప‌ళ్లు తోముకుని వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల‌పై పేరుకున్న గార తొలిగిపోయి.తెల్ల‌గా మార‌తాయి.

Advertisement

అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె, చిటికెడు ఉప్పు వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ వాట‌ర్‌ను నోట్లో పోసుకుని.

పుక్క‌లించి ఉమ్మేయాలి.అనంత‌రం సాధార‌ణ పేస్ట్‌తో దంతాల‌ను తోముకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియాను నాశ‌నం అయ్యి.దంతాల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

మ‌రియు ప‌ళ్లు త‌ళ త‌ళా మెరుస్తాయి.

తాజా వార్తలు