నల్ల చీమలతో కాక్టెయిల్.. వీడియో చూస్తే మతిపోతుంది..

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్‌ భారతదేశ వ్యాప్తంగా ఫుడ్ రివ్యూలు చేస్తూ ప్రజలకి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియజేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుడ్ రివ్యూలకు సంబంధించిన వీడియోలు బాగా ప్రజాదరణ పొందుతున్నాయి.

అయితే ఫుడ్( Food ) రివ్యూ చేసేవారు కొన్నిసార్లు వింత వంటకాలను కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు.నితిన్ తివారీ అనే వ్యక్తి కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కొత్త వంటకాలను పరిచయం చేస్తుంటాడు.

రీసెంట్ వీడియోలో, అతను ముంబైలో ట్రై చేసిన ఒక స్పెషల్ డ్రింక్ వీడియోని షేర్ చేశాడు.ఇదొక కాక్టెయిల్, మిగతా డ్రింకులకు ఇది విభిన్నంగా ఎందుకు ఉంటుందంటే నల్ల చీమలతో దీనిని గార్నిష్ చేశారు.సీఫాహ్‌ అనే ఆసియన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ వైట్ కాక్టెయిల్‌ను చీమలతో కలిపి ఇచ్చారని నితిన్ వెల్లడించాడు.

చీమలు( Black ants ) తినేందుకు క్రిస్పీగా, టేస్టీగా ఉన్నాయని అన్నాడు.వీటిని రోస్ట్ చేశారని పేర్కొన్నాడు.కాక్టెయిల్ ద్రాక్ష ఫ్లేవర్ కలిగి ఉందని వెల్లడించాడు.

Advertisement

ఇది వింత డ్రింక్ అయినా సరే టేస్ట్ బాగానే ఉందని, ముంబైలోని బాంద్రా కి వస్తే ఈ బార్ లో ఈ డ్రింక్ ట్రై చేయవచ్చు అని అతడు సలహా ఇచ్చాడు.

ఈ వీడియో చూసిన చాలామంది షాక్ అవుతున్నారు.ఆ పెద్ద నల్ల చీమలను ఎవరు తింటారు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.ఇది తామే ఎప్పటికీ ట్రై చేయలేమని ఇంకొందరు అన్నారు.

ఈ చీమలను వాటిలో గార్నిష్ గా ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటని మరికొందరు ప్రశ్నించారు.Mr.bartender ఇన్‌స్టాగ్రామ్( Instagram ) పేజీ ఈ వీడియోని షేర్ చేసింది.దీనికి ఇప్పటికే లక్షలు వ్యూస్ వచ్చాయి దీనిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?
Advertisement

తాజా వార్తలు