ఇక తగ్గేదేలే ! ఈ కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ 

బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ తో పాటు, జాతీయ రాజకీయాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల పైన కెసిఆర్ అలర్ట్ అవుతున్నారు.

తెలంగాణ లో బీఆర్ఎస్ ను( BRS ) మూడోసారి గెలిపించడం ద్వారానే జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించగలమనే నమ్మకం తో కేసీఆర్ ఉన్నారు.ఈ మేరకు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలను ఆయన తీసుకున్నారు.

జాతీయ స్థాయిలో బిజెపి కాంగ్రెస్ లకు సమాన దూరం పాటించాలని, ఆ రెండు పార్టీల విధానాల పైన ఇకపై మరింత ఉదృతంగా పోరాటాలు చేపట్టాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే వ్యూహాలకు కేసిఆర్ మరింత పదును పెడుతున్నారు.

బీఆర్ ఎస్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ బిజెపిలు తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, ఈ సమయంలో ఎదురు దాడి చేయకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కెసిఆర్ అంచనా వేస్తున్నారు.అందుకే బీజేపీ కాంగ్రెస్ లపై ఎదురుదాడి మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

పదేపదే బిఆర్ఎస్ ను ఏ టీం అంటూ కాంగ్రెస్ బిజెపి చేస్తున్న ఆరోపణలు తిప్పుకొట్టాలని, అలా తిప్పి కొట్టకపోతే బీఆర్ఎస్ కు డ్యామేజ్ జరుగుతుందని కెసిఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ ప్రభావం తగ్గించేందుకు బిజెపి,( BJP ) కాంగ్రెస్ లు( Congress ) చేస్తున్న ప్రయత్నాలను నిలువరించే విధంగా వ్యవహారాలను సిద్ధం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్,  బిజెపిలు చేరికలపై ఎక్కువ దృష్టి సారించడం, బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో, పార్టీలోని అసమ్మతి నాయకులను బుజ్జగించి కాంగ్రెస్ బిజెపిలోకి చేరికలు జోరందుకోకుండా చేసేందుకు కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.అంతేకాదు బిజెపి, కాంగ్రెస్ లలోని అసంతృప్త నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకుని ఆ రెండు పార్టీలకు జలక్ ఇవ్వాలని కేసిఆర్ నిర్ణయించుకున్నారు.

టిఆర్ఎస్ నుంచి కీలక నేచర్ ఎవరు బిజెపి ,కాంగ్రెస్ లలో చేరకుండా నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు.ఇక ఈనెల 8వ తేదీన వరంగల్ కు ప్రధాని నరేంద్ర మోడీ( PM Modi ) రాబోతుండడంతో, బిజెపి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని , విభజన చట్టం, హామీలు, రాష్ట్రానికి రావలసిన నిధులు ఇతర అంశాలు మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రధానికి నిరసన తెలియజేసే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు