భూ కబ్జా కేసులో ఈట‌ల కుమారుడి పై విచార‌ణ‌కు ఆదేశించిన సీఎం కేసీఆర్.. !

తెలంగాణ‌లో ఈటల రాజేంద‌ర్ భూకబ్జా వ్య‌వ‌హారం రాజకీయ ప్రకంపనాలు సృష్టించడమే కాదు. హాట్ టాపిక్‌గా కూడా మారిన విష‌యం తెలిసిందే.

ఒక్క సారిగా పొలిటకల్ కేరియర్ మొత్తం తిరగబడి పోయింది.ఇన్నాళ్లూ కారు సీటులో ముఖ్య వ్యక్తిగా ఉన్న ఈటల ఆ పార్టీ వీడి ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

Cm Kcr Orders Probe Against Eetala Son Nitin Reddy Land Grab Case Telangana, CM

ఇదే క్రమంలో రాజేందర్‌కు సంబంధించిన భూముల‌పై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించగా, ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది.ఇదే సమయంలో మేడ్చల్ లోని రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేశ్‌ అనే యువ‌కు ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడ‌ని, తన భూమి తనకు ఇప్పించి న్యాయం చేయండంటూ సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు.

దీంతో వెంటనే స్పందించిన కేసీఆర్ అవినీతి నిరోధ‌క శాఖ‌ విజిలెన్స్, రెవెన్యూ శాఖ దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు అసలే ఈటల మీద పీకలదాక కోపంలో ఉన్న ప్రభుత్వం ఇతన్ని పాతాళానికి తొక్కే ఏ ఒక్క చాన్స్ దొరికిన మిస్ చేసుకోదని ఈ విషయం తెలిసిన ప్రజలు అనుకుంటున్నారట అందుకే అంటారు రాజకీయాల్లో కాళ్లు మొక్కేవారు ఎవరో, కిందేసి తొక్కే వారు ఎవరో కనిపెట్టడం కష్టం అని.

Advertisement
రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...

తాజా వార్తలు