విజయవాడ అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

విజయవాడలో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్( CM Jagan ) ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.ఈ విగ్రహం సామాజిక న్యాయ మహాశిల్పమని చెప్పుకొచ్చారు.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని.ఇకనుంచి స్టాచ్యూ ఆఫ్ సామాజిక న్యాయం అంటే విజయవాడ గుర్తొస్తుందని పేర్కొన్నారు.

అంబేద్కర్ విగ్రహం( v ) ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని చెప్పుకోచ్చారు.బడుగు బలహీన వర్గాల మార్చిన ఘనుడు అంబేద్కర్ అని కొనియాడారు.

Advertisement

పెత్తందారితనం అంటరానితనంపై ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారు.దళిత జాతి నిలబడేందుకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి.విద్యా విప్లవం అంబేద్కర్.

ఇప్పటికి రూపు మార్చుకొని అంటరానితనం సమాజంలో ఉంది.పేదలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవకూడదు అనటమే ఇందుకు ఉదాహరణ.

దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు.బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు( Chandrababu naidu )కు ప్రేమే లేదు.

కానీ తమ ప్రభుత్వం వచ్చాక పేదలు చదువుకునే ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి.ఆ రకంగా తమ ప్రభుత్వం పనులు చేస్తే పెత్తందారులకు నచ్చలేదు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
రజినీకాంత్ కూలీ సినిమాలో మలయాళ నటుడు...

అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు అంటూ సీఎం జగన్ సంచలన స్పీచ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు