సైకిల్‌ లాంటి ఎలక్ట్రిక్‌ బైక్‌.. అందరికీ తెగ నచ్చుతోంది!

కరోనా నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై మొగ్గు చూపుతున్నారు.అందులోనూ పెరుగుతోన్న పెట్రోల్‌ ధరలు.

ప్రస్తుతం భారత్‌లో సెంచరీ దాటేసింది.అందుకే చాలా మంది ఇక ఎలక్ట్రిక్‌ బాట పట్టాల్సిందేనని అనుకుంటున్నారు.

ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అందుబాటులోకి తెస్తూనే ఉన్నాయి.తాజాగా న్యూయార్క్‌కు చెందిన సివిలైజ్డ్‌ సైకిల్స్‌ ఓ అద్భుతమైన ఎలక్ట్రిక్‌ సైకిల్‌ బైక్‌ను లాండ్‌ చేసింది.

దీనికి ‘మోడల్‌ 1’ అని పేరు పెట్టింది.ఇది చూడటానికి అచ్చం సైకిల్‌లా కనిపిస్తుంది.

Advertisement
Civilized Model 1 New Electric Cycle Bike Now In Market. America, E-bike. New Yo

దీనిపై కంపెనీ మాట్లాడుతూ.ఈ సైకిల్‌పై ప్రయాణం చాలా సులభంగా ఉంటుందని చెబుతోంది.

ఈ సైకిల్‌కు బ్యాటరీ, హార్డ్‌ కేస్, హెడ్‌ అండ్‌ టెయిల్‌ లైట్స్‌ ఉన్నాయి.అంతేకాదు ఈ బైక్‌కి సెన్సార్, టచ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసింది.పెడల్‌ పవర్‌తోపాటు 1.5 కిలోవాట్స్‌ మిడ్‌ డ్రైవ్‌ మోటర్‌ ఉంటుంది.గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు.

దీనిలో ఉండే ఏబీ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌లో ఉంది.ఒక్కసారి రీఛార్జి చేస్తే చాలు దాదాపు 80 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయవచ్చు.

సైకిల్‌ లా ఉంటుంది కదా! ధర తక్కువే ఉంటుందని అనుకోకండి.దీని అసలు ధర 4,499 డాలర్లు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
భారతదేశంలో కూడా భూకంపం రాబోతోందా? అసలేం జరుగుతోంది?

ఇది ఆఫర్‌ ప్రైజ్‌.

Civilized Model 1 New Electric Cycle Bike Now In Market. America, E-bike. New Yo
Advertisement

మన రూపీలో అక్షరాల రూ.3,33,574.ఈ బైక్‌కు మరో అద్భుత ఫీచర్‌ కూడా ఉంది.హెడ్‌లైట్‌ ఆటోమెటిగ్గా కంట్రోల్‌ అవుతుంది.

అంటే ఏదైనా వెహికల్‌ ఎదురుగా వస్తే, అదే లైట్‌ పెంచుకుంటుంది.తగ్గించుకుంటుంది.ఈ బైక్‌ వెనుక వైపు సామాన్లు ఈజీగా మోసుకెళ్లే జాగ ఉంటుంది.32 ఎంఎం ఫ్రంట్‌ ఫోర్స్‌ అండ్‌ డిస్క్‌ బ్రేకులు బైక్‌కు రెండు వైపులా ఉంటాయి.దొంగల భయం కూడా ఉండదు.

ఎందుకంటే థెఫ్ట్‌ ట్రాకింగ్‌కు పిన్‌ కోడ్‌ లాక్‌ సిస్టం కూడా ఉంది.

రానున్న రోజుల్లో దీని ధరను పెంచనున్నామని కంపెనీ తెలిపింది.అంటే దీంతో ఈ బైక్‌ ధర నాలుగు లక్షలు దాటేయొచ్చు.భారత్‌లో అయితే ఈ ధరకు కొన్ని కార్లు కూడా కొనవచ్చు అనుకుంటారు.

మన మార్కెట్‌లో అంత ధర పెట్టి కేవలం ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుక్కోరు కదా! ఇక కంపెనీ ఈ బైక్‌కు సంబంధించిన రెండు వీడియోలను అప్‌లోడ్‌ చేసింది.సంబంధిత కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ బైక్‌కు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

తాజా వార్తలు