వాల్తేరు వీరయ్య సినిమా వల్ల తీవ్ర నిరాశలో ఆ ఐదుగురు!

సంక్రాంతి 2023 విన్నర్ ఎవరు అంటే సినిమా ఇండస్ట్రీ తో పాటు అభిమానులందరూ కూడా ముక్తకంఠంతో వాల్తేరు వీరయ్య అని గట్టిగా చెప్తున్నారు.

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో పాటు వీర సింహా రెడ్డి, కళ్యాణం కమనీయం, వారసుడు, తెగింపు వంటి సినిమాలన్నీ విడుదలవగా వీటన్నిటినీ దాటి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన చిత్రంగా వాల్తేరు వీరయ్య కు పేరు లభించింది.

తనదైన కామెడీ టైమింగ్ తో వాల్తేరు వీరయ్య అందరిని అలరించాడని చెప్పవచ్చు.గతంలో ఆయన చేసిన గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి, ఘరానా మొగుడు, రిక్షావోడు వంటి వింటేజ్ సినిమాలతో సమానంగా ఈ సినిమా అటు క్లాస్ తో పాటు ఇటు మాస్ ఆడియన్స్ కి మంచి త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది.

బాసు ఒక్కసారి కామెడీతో దిగారంటే బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే అని మరోసారి వాల్తేరు వీరయ్యతో నిరూపితమైంది.ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయిన దాఖలాలు లేవు అందుకే వాల్తేరు వీర్యయ్య కు అది ప్లస్ పాయింట్ గా మారింది.

ఇక ఈ సినిమాకి చిరంజీవితో పాటు రవితేజ కూడా మంచి ఎనర్జీ ఇవ్వడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారింది.

Chiranjeevi Waltheru Veeraiah Disappointed These Actors Catherine Shruti Hasan P
Advertisement
Chiranjeevi Waltheru Veeraiah Disappointed These Actors Catherine Shruti Hasan P

చిరంజీవి మరియు రవితేజ పాత్రను పక్కన పెడితే ఈ సినిమా ఒక ఐదుగురికి మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది.ఈ సినిమాలో నటించిన శృతిహాసన్ కి ఏ మాత్రం పేరు దక్కలేదు అందుకే కాబోలు ఆడియో ఫంక్షన్ కి కూడా హాజరు కాలేదు.ఆమె చేసిన రా ఏజెంట్ పాత్ర జనాలకు ఎక్కను లేదు.

ఇక ఆమె తర్వాత ఈ సినిమాకు కీరోల్ అని భావించిన ప్రకాష్ రాజ్ సైతం ఏమాత్రం పేరును దక్కించు కోలేకపోయాడు.

Chiranjeevi Waltheru Veeraiah Disappointed These Actors Catherine Shruti Hasan P

చాలా రోజులుగా తాత, తండ్రి పాత్రలు వేస్తున్న ప్రకాష్ రాజ్ కి ఒక యంగ్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు.అయినా కూడా అది ప్రకాష్ రాజ్ కి వర్కౌట్ కాలేదు అని చెప్పాలి.ఇక సై సినిమాలో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్ సైతం ఈ సినిమాలో కేవలం జూనియర్ ఆర్టిస్ట్ తరహా పాత్ర మాత్రమే పోషించాడు.

రవితేజ కు జోడిగా నటించిన కేథరిన్ కి సైతం ఒక డైలాగ్ మినహా ఏమీ దక్కలేదని చెప్పాలి.చాలా రోజులుగా టాలీవుడ్ ఎంట్రీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ఊర్వశి రౌతాలా కి సైతం ఒక ఐటమ్ సాంగ్ ఇచ్చినప్పటికీ అది పెద్దగా ఆమెకు ప్రయోజనకరంగా లేదు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు