లాక్‌డౌన్‌లో చిరు సర్‌ప్రైజ్.. ఏమిటో?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడట.

ఇక ఈ సినిమా పూర్తి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

కాగా ఈ సినిమాలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిరు ఓ సినిమా ఈవెంట్‌లో లీక్ చేయడంతో చిత్ర యూనిట్ అవాక్కయ్యింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిరు రెడీ అవుతున్నాడు.ఈ మేరకు ట్విట్టర్‌లో తాజాగా ఓ ట్వీట్ కూడా చేశాడు.

Advertisement

రేపు ఉదయం 9 గంటలకు ఓ సర్‌ప్రైజ్ ఉన్నట్లు చిరు పేర్కొన్నాడు.అయితే ఈ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ను చిరు చెప్తాడా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు