చిరంజీవి సినిమాలో లవ్ ట్రాక్ లేదా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

చిరంజీవి( Chiranjeevi ) అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్టాఫ్ లాక్ అయిన సంగతి తెలిసిందే.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో హీరోయిన్ కోసం అదితీరావు హైదరీ( Aditirao Hydari ) పేరును పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.అయితే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీలో మెగాస్టార్ కు లవ్ ట్రాక్ ఉండదని తెలుస్తోంది.

ఈ సినిమాలో సైతం కామెడీకి పెద్దపీట వేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈ సినిమాలో చిరంజీవి లుక్ సైతం కొత్తగా ఉంటుందని ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని( Vintage Chiranjeevi ) చూడటం పక్కా అని తెలుస్తోంది.

Advertisement
Megastar Chiranjeevi Anil Ravipudi Combo Movie Shocking Update Details, Chiranje

చిరంజీవి వయస్సుకు తగిన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు.

Megastar Chiranjeevi Anil Ravipudi Combo Movie Shocking Update Details, Chiranje

చిరంజీవి ఈ సినిమాలో సీమ యాసలో మాట్లాడతారని ఇండస్ట్రీ వర్గాల టాక్.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.ఈ ఏడాది విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న చిరంజీవి వచ్చే ఏడాది మాత్రం అనిల్ రావిపూడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

Megastar Chiranjeevi Anil Ravipudi Combo Movie Shocking Update Details, Chiranje

నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న చిరంజీవికి భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా చిరంజీవి రెమ్యునరేషన్ 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.చిరంజీవికి రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని ఆశిద్దాం.

వైరల్: ఇది చూశారంటే ఈ గిటారిస్ట్‌కు చేతులెత్తి దండం పెడతారు!
హైదరాబాదీ అమ్మాయితో ప్రభాస్ వివాహం... ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ టీమ్!

డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మించిన హిట్ అందుకుంటారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు