చిన్నారుల మొదటి బడి అంగన్ వాడీ:ఎమ్మెల్యే బిఎల్ఆర్

నల్లగొండ జిల్లా:చిన్నారుల మొదటి బడి అంగన్ వాడిలో టీచర్లు చిన్నారులకు మొదటి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాట పాటలతో కూడిన విద్యను అందించడం కాకుండా గర్భిణీలకు,బాలింతలకు, చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను శాలువా కప్పి సన్మానించి పూలమాలతో సత్కరించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య,జడ్పిటిసి ఇరుగు మంగమ్మ,వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని,ఎంపిటిసిలు చల్లబట్ల చైతన్య,ప్రణీత్ రెడ్డి,పల్లా వీరయ్య, పిఎసిఎస్ఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్,సిడిపిఓ చంద్రకళ,అంగన్వాడి సూపర్ వైజర్ సునీత,కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, శశిధర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ రావు ఎల్లారెడ్డి,మాజీ సర్పంచులు నాగవల్లి, రవీందర్ రెడ్డి,మాజీ ఎంపిటిసిలు గంజి శ్రీనివాస్, తమ్ముడబోయిన అర్జున్, మధు,అంగన్వాడి సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

సమంతను వదలని ఆ ఇద్దరు డైరక్టర్లు...మరో ఛాన్స్ కొట్టేసిన నటి!
Advertisement

Latest Nalgonda News