అయ్య‌ప్ప ద‌ర్శ‌నం కోసం 580 కిలోమీట‌ర్లు న‌డిచిన చిన్నారులు..

అయ్యప్ప స్వామి మాలధారణ చాలా నిష్ట నియమాలతో కూడుకున్నది.ఇందుకు ఎంతో ఓర్పు ఉండాలి.

ప్రతి ఏడాది లక్షల మంది అయ్యప్ప మాల ధరిస్తుంటారు.వీరిలో చాలా మంది కాలినడకన శబరిమలకు వెళుతుంటారు.

కొందరైతే వందల కిలోమీటర్ల దూరం నుంచి నడక మార్గం ద్వారా శబరిమల చేరుకుని అయ్యప్పస్వామి ఆశీస్సులు పొందుతుంటారు.ఓ ఇద్దరు చిన్నారులు సైతం అయ్యప్ప మాల ధరించి.

నెత్తిన ఇరుముళ్లతో కాలినడకన శబరిమల బయలుదేరారు.వారి వయస్సు 10 ఏళ్ల లోపే ఉంటుంది.

Advertisement
Children Walk 580 Km In Ayyappa Maala From Bangalore To Shabarimala Details, Ay

‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రహదారిపై బుడిబుడి అడుగులతో ముందుకు సాగుతున్నారు.బెంగళూరు నుంచి ప్రారంభమైన వీరి పాదయాత్ర శబరిమల చేరుకోవాలంటే 580 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర సాగిస్తున్న ఈ చిన్నారుల పట్టుదల, ధైర్యం, భక్తి, ఓర్పును చూసి రోడ్డుపై వెళ్లే వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.కొందరైతే అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే ఆ చిన్నారుల కాళ్లకు నమస్కారం చేస్తూ తమకు తోచిన సహాయం చేస్తున్నారు.

 ప్రస్తుతం ఈ చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.వీడియోను చూసిన వారు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

వీరు క్షేమంగా శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామి దర్శించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Children Walk 580 Km In Ayyappa Maala From Bangalore To Shabarimala Details, Ay
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఇక్కడ మనం ఓ విషయం గురించి చెప్పుకోవాలి.మనం కొంత దూరం నడిచి వెళ్లి రావడానికి హైరానా పడుతుంటాం.ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే బైక్ లేదా కారు ఉండాల్సిందే.

Advertisement

అంత స్తోమత లేని వారు రిక్షానో లేక ఆటోలో వెళుతుంటారు.అలాంటిదీ శబరిలకు కాలినడకన.

అది బెంగళూరు నుంచి పదేళ్ల లోపు చిన్నారులు వెళుతున్నారంటే నిజంగా వారి ధైర్యం, ఓర్పుకు సెల్యూట్ చేయాల్సిందే. ఇక ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.

తాజా వార్తలు