బ్రిడ్జి లేకున్నా కాల్వ‌ను దాటేస్తున్న కోళ్లు.. ఎలాగో తెలిస్తే..

నెట్టింట వైర‌ల్ అయ్యే వీడియోల్లో ఎక్కువ‌గా జంతువుల‌కు సంబంధించిన‌వే ఉంటాయి.

ఎందుకంటే ఇవి ఎలాంటి ముంద‌స్తు ప్లానింగ్ లేకుండా న్యాచుర‌ల్ గా చేస్తాయి కాబ‌ట్టి వాటికి ఆద‌ర‌ణ బాగానే ఉంటుంది.

మ‌నుషుల్లాగా అవి ఏమీ కంటెంట్ రాసుకుని వీడియోలు చేయ‌వు.త‌మ దైనందిన జీవితంలో భాగంగా చేసే ప‌నులే మ‌న‌కు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌టం క‌నిపిస్తుంది.

ఇప్పుడు కూడా ఇలాంటి వైర‌ల్ వీడియో ఒక‌టి తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.మ‌రి వైర‌ల్ వీడియో అనగానే అది ఏ జంతువుకో లేదంటే ప‌క్షికో సంబంధించిందే అయి ఉంటుందని తెలుసు క‌దా.

ఈ వీడియో చూస్తే నిజంగా మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేకుండా పోతాం.ఎవ‌రైనా ట్రైనింగ్ ఇచ్చారా వీటికి అనిపిస్తుంది.

Advertisement

నిజానికి జంతువులు కూడా మ‌నుషుల‌ను చూసి ఈ రోజుల్లో చాలా ప‌నులు నేర్చుకుంటున్నాయి.మ‌నుషుల్లాగే న‌డ‌వ‌డం, కూర్చోవ‌డం, న‌మ‌స్కారాలు చేయ‌డం ఇలాంటివి మ‌నం చూస్తేనే ఉన్నాం.

ఇప్పుడు కూడా కోళ్లు ఇలాంటి షాకింగ్ ప‌నే చేస్తున్నాయి.ఈ వీడియోను గ‌న‌క చూస్తే ఎవ్వ‌రైనా షాకవుతారు.

ఇందులో కొన్ని కోళ్లు క‌లిసి ఓ కాలువ ద‌గ్గ‌ర‌కు రావ‌డం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తుంది.

అయితే ఇలా వ‌చ్చిన కోళ్లు ఆ కాల్వ మీద బ్రిడ్జి లేకపోయినా స‌రే కేవ‌లం ఆ కాలువ మీదుగా ఉన్న తాళ్ల సాయంతో బ్రిడ్జి దాటుతుంటాయి.తాడు మీద నుంచి క్యాట్ వాక్ చేసుకుంటూ కింద ప‌డ‌కుండా స‌ర్క‌స్ చేసిన‌ట్టే దాటేస్తున్నాయి.ఒక్క‌టి కూడా కింద ప‌డ‌కుండా ఇలా దాట‌డం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..

జాగ్రత్తగా నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకోవ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు.ఇక దీన్నంతా అక్క‌డున్న వారు వీడియో తీసి నెట్టింట షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Advertisement

వీటి క్యాట్ వాక్ కు అంద‌రూ ఫిదా అవుతున్నారు.మ‌రి మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు