స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రిమాండ్

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుపై విచారణ జరిపిన విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది.

ఈ మేరకు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది.కేసుపై సుదీర్ఘ విచారణ జరగగా కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై సీఐడీ వివరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆర్థిక నేరాల నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని కోరారు సీఐడీ అధికారులు.ఈ క్రమంలో వారి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం చంద్రబాబుకు ఈనెల 22 వరకు రిమాండ్ విధించారు.

కాగా ఇప్పటికే ఏసీబీ కోర్టు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించిన విషయం తెలిసిందే.టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో విజయవాడ అంతటా పోలీసుల మోహరించారు.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు