ఆరు నెలల పాలన.. లక్షల కోట్ల నష్టం!

చంద్రబాబు తన హయాంలో ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్‌రెడ్డి పుస్తకాలు కూడా అచ్చేయించారు.

తాను అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయినా.

ఆ ఆరు లక్షల కోట్ల అవినీతిలో ఆరు రూపాయల అవినీతిని కూడా చూపించలేకపోయారు.కానీ అదే ఆరు నెలల పాలనలో ఏపీకి మాత్రం కొన్ని లక్షల కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టారు.

జగన్‌ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేశాయని, కొన్ని లక్షల కోట్ల నష్టం వాటిల్లిలే చేశాయని లెక్కలతో సహా చెబుతున్న ఓ వాట్సాప్‌ వీడియో వైరల్‌గా మారింది.ఈ ఆరు నెలల్లో ఏ నిర్ణయం ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో అందులో సవివరంగా ఉంది.

దాని ప్రకారం.జగన్‌ వచ్చిన తర్వాత కేవలం పెట్టుబడుల ద్వారానే ఏపీ లక్షా 80 వేల కోట్లు నష్టపోయింది.

Chandrababu Naidu Ys Jagan Six Moths
Advertisement
Chandrababu Naidu Ys Jagan Six Moths-ఆరు నెలల పాలన.. ల�

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పెట్టుబడులు కాదు కదా.ఉన్నవీ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.విశాఖలో అదానీ డేటా సెంటర్‌ పెట్టుబడి 70 వేల కోట్లు, అక్కడే లులూ గ్రూపు పెట్టుబడి 2200 కోట్లు, సింగపూర్‌ స్టార్టప్‌ ప్రాజెక్ట్‌ 50 వేల కోట్లు, బీఆర్‌ శెట్టి సంస్థ 12 వేల కోట్లు, ఆసియా పేపర్‌ మిల్స్‌ 24 వేల కోట్లు, కియా అనుబంధ సంస్థలు 2 వేల కోట్లు, వరల్డ్‌ బ్యాంక్‌ 2100 కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 1400 కోట్ల పెట్టుబడులు జగన్‌ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లిపోయాయి.ఇక పోలవరం రివర్స్‌ టెండరింగ్ వల్ల సుమారు రూ.7500 కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపిస్తోంది.అటు అధికార పార్టీకి పట్టిన రంగుల పిచ్చి విలువ ఇప్పటికే రూ.1300 కోట్లు కాగా.త్వరలో ఇది 2 వేల కోట్లను మించనున్నట్లు అంచనా.జగన్‌ తన సొంత ఇంటి హంగుల కోసం ఇప్పటి వరకూ రూ.17.2 కోట్ల ప్రజధనాన్ని దుర్వినియోగం చేశారు.ప్రజా వేదికను కూల్చడం ద్వారా మరో రూ.9 కోట్లు వృథా అయ్యాయి.వీటికి తోడు ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలైంది.

లక్షల మంది కూలీలు రోడ్డున పడ్డారు.రోజూ మూడు లక్షల మంది పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి.

ఇప్పుడు అమరావతి కట్టడానికి డబ్బుల్లేవంటూ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన జగన్‌.తన వల్ల జరిగిన ఈ ఆర్థిక నష్టాన్ని మాత్రం గుర్తించడం లేదు.

జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?
Advertisement

తాజా వార్తలు