YS Sharmila : చంద్రబాబు, జగన్ బీజేపీకి బానిసలు..: షర్మిల

తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో కాంగ్రెస్ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) పాల్గొన్నారు.

దళిత హోంమంత్రి ఉన్నా రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని ఆరోపించారు.

వైసీపీ నేతల అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ క్రమంలోనే హోంమంత్రి పదవికి తానేటి వనిత( Home Minister Taneti Vanitha ) రాజీనామా చేయాలన్నారు.

చంద్రబాబు,( Chandrababu ) సీఎం జగన్( CM Jagan ) ఇద్దరూ బీజేపీకి బానిసలేనని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు.బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, జగన్ పోటీ పడుతున్నారని తెలిపారు.

టీడీపీ, వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు.ఈ క్రమంలో ప్రజలు ఆలోచించాలన్న షర్మిల కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీ బాగుపడుతుందని తెలిపారు.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు