చాందిని చౌదరి తప్పు చేసిందా ?

చాందిని చౌదరి అంటే ఎవరో షార్ట్ ఫిల్మ్స్ చూసే జనాలకి పెద్దగా చెప్పాల్సిన పని లేదు .

మధురం అనే ఒకే ఒక్క షార్ట్ ఫిలిం చుడండి చాలు మీకు చాందిని తెలియకపొతే .

నిండు తెలుగుదనం, చూడచక్కని రూపం, నటన ప్రతిభ .అన్ని ఉన్న అమ్మాయి చాందిని .యుట్యూబ్ స్టార్ హీరోయిన్ చాందిని .షార్ట్ ఫిల్మ్స్ లో సమంత, కాజల్ రేంజ్ చాందిని ది.షార్ట్ ఫిల్మ్స్ నుంచి ప్రమోట్ అవ్వాలనుకుంది సరే .సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది సరే .అంత అందంగా ఉన్నాక కోరిక పుట్టకపోతేనే తప్పు .కాని మొదటి అడుగులే సరిగా వేయకపోతే ఎలా ? ఇప్పుడు చాందిని కేటుగాడు, కుందనపు బొమ్మ అనే రెండు సినిమాలు చేస్తోంది .రెండు సినిమాల ప్రచార చిత్రాలు ఇటివలే విడుదల అయ్యాయి .కాని రెండు ఆకట్టుకోలేదు.అసలు చాందిని ఏంటి ఇలా ఎంట్రి ఇస్తోంది .ఆచితూచి ఆడుగులు వేయోచ్చుగా అని బాధపడుతున్నాడు సగటు షార్ట్ ఫిల్మ్స్ అభిమాని.అందం, టాలెంట్ .అన్ని ఉన్నాయి .అన్నిటికి మించి తెలుగమ్మాయి .షార్ట్ ఫిల్మ్స్ రాణి ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో పసి బిడ్డ .ఎదుగుతుందో లేదో చూడాలి.

Chandini Chowdary Did A Mistake ?-Chandini Chowdary Did A Mistake -Telugu Gossip
మెగాస్టార్ చిరంజీవి లైనప్ మారబోతుందా.. ఈ కన్ఫ్యూజన్ వెనుక అసలు కారణాలివే!

తాజా వార్తలు